ముళ్లపంది ముళ్లు పులిని చంపేస్తాయా..!

Update: 2019-07-30 15:49 GMT

ముళ్లపంది ఇది ఎలుక జాతికి చెందినది. అయితే ముళ్లపందిపై ఉండే ముళ్లు గురించి రకరకాలు అనుకునే వారు ఉన్నారు. దాని శరీరంపై కొంత మంది ముళ్లు ఉంటాయని.. మరికొంత మంది వెంట్రుకలు అని భావిస్తారు. అయితే ముళ్లపంది శరీరంపై పుట్టినప్పుడు వెంట్రుకల్లాగా మృదువుగా ఉంటాయి. కొన్నాళ్లకు గట్టిగా మారతాయి. కొనలు బాగా పదునుగా మారి ముళ్లలాగవుతాయి. దీని శరీరంపై దాదాపు 30 వేల ముళ్లు ఉండటం విశేషం.

మరో విశేషం ఏంటంటే ముళ్లపంది శాకాహారి. అయితే పులి దీన్ని వేటాడే సమయంలో దీనికున్న ముళ్లు దాని నోటిలో, కడుపులో గుచ్చుకుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ ముళ్లు వల్ల బలమైన గాయాలు ఏర్పడి పులి చనిపోయే అవకాశం కూడ ఉంది. ఈ ముళ్లుకు పులి కడుపులోని పేగుల్నీ చీల్చేయగల శక్తి ఉంటుంది. దీని ముళ్లు అంత పదునుగా ఉంటాయి మరి. 

Tags:    

Similar News