వర్షం, చలిలో పాముల నుండి రక్షణ ఇలా… మీ ఇంటి గుమ్మంలో ఇవి ఉంటే పాములు దరిచేరవు!
చలి, వర్షాకాలం వంటి సీజన్లలో పాములు తరచుగా ఇళ్లలోకి రావడం సాధారణమే. బయట చలి ఎక్కువగా ఉండడంతో అవి వెచ్చదనాన్ని కోసం జనావాసాల్లోకి చేరుతాయి.
వర్షం, చలిలో పాముల నుండి రక్షణ ఇలా… మీ ఇంటి గుమ్మంలో ఇవి ఉంటే పాములు దరిచేరవు!
చలి, వర్షాకాలం వంటి సీజన్లలో పాములు తరచుగా ఇళ్లలోకి రావడం సాధారణమే. బయట చలి ఎక్కువగా ఉండడంతో అవి వెచ్చదనాన్ని కోసం జనావాసాల్లోకి చేరుతాయి. అయితే కొన్ని సహజ చిట్కాలను పాటిస్తే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. పాములను దూరంగా ఉంచే వాసన గల వస్తువులను ఇంటి గుమ్మంలో, కిటికీల దగ్గర లేదా ఇంటి ఆవరణలో ఉంచడం ద్వారా వాటి ప్రవేశాన్ని నియంత్రించవచ్చు.
1. ఘాటైన వాసన గల మొక్కల వేర్లు
కొన్ని ప్రత్యేకమైన మొక్కల వేర్లు పాములను భయపెట్టేలా ఉండే ఘాటైన వాసనను విడుదల చేస్తాయి. ఈ వాసన పాములకు అస్సలు నచ్చదు. అలాంటి వేర్లను ఇంటి గుమ్మం వద్ద ఉంచితే అవి ఇంట్లోకి రాకుండా నిరోధించవచ్చు.
2. తెల్లగరిగే మొక్క వేర్లు
పాములు ఇష్టపడని వాసన కలిగిన మొక్కల్లో తెల్లగరిగే మొక్క కూడా ఒకటి. ఈ మొక్క మీ ఇంటి పరిసరాల్లో ఉంటే, లేదా దాని వేర్లను గుమ్మం వద్ద ఉంచితే వాటి వాసనతో పాములు ఇంటికి దగ్గరపడవు.
3. దాల్చిన చెక్క, లవంగ నూనె ప్రయోజనం
పాములకు దాల్చిన చెక్క, లవంగం, వీటి నూనెల వాసన ఇబ్బంది కలిగిస్తుంది.
ఇంటి గుమ్మంలో,
కిటికీ అద్దాలపై,
ఇంటి ప్రాంగణం చుట్టూ
ఈ నూనెలను రాసినా పాములను దరిచేరనివ్వకుండా చేయవచ్చు.
4. తులసి వేర్లు
తులసి మొక్క వేర్ల వాసన కూడా పాములు అస్సలు భరించలేవు. తులసి వేర్లను తీసుకుని ఇంటి గుమ్మంలో కట్టినట్లయితే పాములు ఇంట్లోకి ప్రవేశించకుండా నివారించవచ్చు.
గమనిక: పైన పేర్కొన్న పద్ధతులు ప్రజల్లో ప్రచారంలో ఉన్న సంప్రదాయ చిట్కాలు మాత్రమే. ఇవి కేవలం అవగాహన కోసం అందించబడినవి. వీటి ప్రభావాన్ని మీడియా సంస్థలు లేదా నిపుణులు ధ్రువీకరించలేదు.