Uric Acid: కరోనా కాలంలో పెరిగిన యూరిక్‌ యాసిడ్‌ పేషెంట్లు.. లక్షణాలు ఎలా ఉంటాయంటే..?

Uric Acid: కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు...

Update: 2022-01-05 09:03 GMT

Uric Acid: కరోనా కాలంలో పెరిగిన యూరిక్‌ యాసిడ్‌ పేషెంట్లు.. లక్షణాలు ఎలా ఉంటాయంటే..?

Uric Acid: కరోనా వల్ల చాలామంది వ్యక్తులు ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. మనిషిలో చురుకుదనం తగ్గి అనేక వ్యాధులకు గురవుతున్నారు. అందులో ఒకటి యూరిక్ యాసిడ్. ఇది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. 30 ఏళ్లు దాటిన వారిలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తోంది. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల శరీరంలో కీళ్ల నొప్పులు, వాపులు, తదితర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అయితే ఈ వ్యాధిని కొన్ని హోం రెమిడిస్‌తో తగ్గించుకోవచ్చు.

శరీరానికి అనేక విధాలుగా ఉపయోగపడే అవిసె గింజలు యూరిక్ యాసిడ్ సమస్యను వదిలించుకోవడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అవిసె గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో నమిలి తినాలి. దీంతో యూరిక్ యాసిడ్ అదుపులో ఉంటుంది. విటమిన్ ఈ ఆలివ్ ఆయిల్‌లో సమృద్ధిగా ఉంటుంది. దీని వినియోగం యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే ఆలివ్ ఆయిల్ ను ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది.

శరీరానికి సంబంధించిన ప్రతి సమస్యకు నీరు దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఎక్కువ నీటితో హానికరమైన పదార్థాలు శరీరం నుంచి బయటకు వెళుతాయి. మూత్రపిండాలు మెరుగ్గా పనిచేస్తాయి. కాబట్టి ఈరోజు నుంచే నీరు ఎక్కువగా తాగడం అలవాటు చేసుకోండి. ప్యూరిన్-రిచ్ ఫుడ్స్ జీర్ణక్రియ ప్రక్రియలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి చేస్తాయి. అందుకే బఠానీలు, బచ్చలికూర, పుట్టగొడుగులు, ఎండిన బీన్స్, పంది మాంసం, చికెన్, చేపలు, మటన్, కాలీఫ్లవర్, కిడ్నీ బీన్స్, బీర్‌లను ఎక్కువగా తీసుకోకూడదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే, యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది.

Tags:    

Similar News