Health Tips:గుండెపోటు, క్యాన్సర్‌కి శత్రువు ఈ ధాన్యం.. ఈ రోజే డైట్‌లో చేర్చుకోండి..!

Health Tips:గుండెపోటు, క్యాన్సర్‌కి శత్రువు ఈ ధాన్యం.. ఈ రోజే డైట్‌లో చేర్చుకోండి..!

Update: 2023-01-13 15:30 GMT

Health Tips:గుండెపోటు, క్యాన్సర్‌కి శత్రువు ఈ ధాన్యం.. ఈ రోజే డైట్‌లో చేర్చుకోండి..!

Health Tips:ఆహారం, పానీయాలు ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే రోజువారీ ఆహారంలో తృణ ధాన్యాలను చేర్చుకోవడం ఉత్తమం. క్వినోవా తృణ ధాన్యాలలో ఒక ధాన్యం. ఇది శీతాకాలపు సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు. క్వినోవాలో ఫైబర్, విటమిన్లు, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు గుండెపోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని దూరం చేస్తాయి.

గుండెకు ప్రయోజనకరం:

క్వినోవాలో ఒమేగా 3, మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి గుండె రోగులకు చాలా మేలు చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని దూరం చేస్తాయి.

జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి:

క్వినోవా జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు దూరమవుతాయి. జీర్ణక్రియకు సంబంధించిన సమస్య ఉంటే క్వినోవాను ఆహారంలో భాగంగా చేసుకోవడం ఉత్తమం.

క్యాన్సర్‌ని తగ్గిస్తుంది:

క్వినోవా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నయం చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. క్వినోవా క్యాన్సర్ చికిత్సలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఎముకలను బలపరుస్తాయి:

క్వినోవాలో ఉండే ప్రోటీన్, అమైనో ఆమ్లాలు, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ ఎముకలను బలోపేతం చేయడానికి పని చేస్తాయి. క్వినోవా తినడం వల్ల ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధి వంటి వ్యాధుల ప్రమాదాన్ని తొలగిస్తుంది.

రక్తహీనత దూరం:

క్వినోవాలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల శరీరంలోని రక్తహీనత తొలగిపోతుంది. క్వినోవాను ఆహారంలో చేర్చుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

Tags:    

Similar News