Korean skincare: అబ్బాయిల కోసం కొరియన్ బ్యూటీ టిప్స్!
కొరియన్స్ అంటేనే బ్యూటీ ట్రెండ్స్‌కు పెట్టింది పేరు. అక్కడ అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా స్పెషల్ స్కిన్‌కేర్ ఫాలో అవుతారు.
Korean skincare: అబ్బాయిల కోసం కొరియన్ బ్యూటీ టిప్స్!
కొరియన్ స్కిన్ కేర్
కొరియన్స్ అంటేనే బ్యూటీ ట్రెండ్స్‌కు పెట్టింది పేరు. అక్కడ అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా స్పెషల్ స్కిన్‌కేర్ ఫాలో అవుతారు. అందుకే కొరియన్ అబ్బాయిలకు ప్రపంచవ్యా్ప్తంగా ఫ్యాన్స్ ఎక్కువ. మరి కొరియన్ అబ్బాయిలు పాటించే బ్యూటీ టిప్స్ ఏంటో తెలుసా?
డైలీ టోనింగ్
కొరియన్ అబ్బాయిలు స్కిన్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ప్రతి రోజూ మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ వంటివి వాడడంతోపాటు క్లెన్సింగ్, స్క్రబ్బింగ్ కూడా చేస్తారు.
ఫేస్ వాష్
అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా స్కిన్ హెల్దీగా ఉండాలంటే డైలీ ఫేస్‌వాష్ ముఖ్యం. రోజువారీ ఫేస్‌వాష్ వల్ల ముఖంపై పేరుకున్న డస్ట్ పోతుంది. తద్వారా స్కిన్ తాజాగా ఉంటుంది.
స్టీమింగ్
కొరియన్ స్కిన్‌కేర్‌లో స్టీమింగ్ ప్రధానమైంది. కొరియన్ అబ్బాయిలు వీలున్నప్పుడల్లా ముఖానికి ఆవిరి పడతారు. దీనివల్ల చర్మంలో పేరుకున్న మృతకణాలన్నీ తొలగిపోతాయి.
ఫేషియల్ స్ట్రెచింగ్
ముడతలు లేని బిగుతైన చర్మం కోసం కొరియన్లు ఫేషియల్ ఎక్సర్‌సైజులు చేస్తారు. ముఖం మీద ట్యాప్ చేయడం, రోలర్స్ వాడడంతో పాటు కొన్ని ఫేస్ వర్కవుట్స్ కూడా చేస్తారు.
కొల్లాజెన్ బేస్డ్ ప్రొడక్ట్స్
చర్మ సౌందర్యానికి కొల్లాజెన్ ఎంతో ముఖ్యం. కొల్లాజెన్ అనేది చర్మంలో ఉండే ఒక ప్రొటీన్. స్కిన్ కేర్ కోసం ప్రొడక్ట్స్ ఎంచుకునేటప్పుడు అందులో కొల్లాజెన్ ఉండేలా చూసుకుంటే చర్మం మరింత హెల్దీగా ఉంటుంది.
డైట్
ఇక అన్నింటికంటే ముఖ్యంగా కొరియన్ అబ్బాయిలు ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తింటారు. స్కిన్‌కేర్ రొటీన్ లో భాగంగా నీళ్లు ఎక్కువ తాగుతారు. ఎప్పుడూ క్లీన్ షేవ్‌తో ఉంటారు. ఇదే వాళ్ల అందానికి సీక్రెట్.