Independence Day: స్వాతంత్ర్య దినోత్సవం 2025 స్పెషల్ ట్రావెల్ గైడ్

ఆగస్టు 15, 2025 స్వాతంత్ర్య దినోత్సవం ఈసారి లాంగ్ వీకెండ్‌గా రాబోతోంది. ఆగస్టు 15 శుక్రవారం కావడంతో, శని, ఆదివారం చాలా మందికి సెలవులు. ఈ సందర్భంగా దేశభక్తి భావనను పెంచేలా, చారిత్రక ప్రాధాన్యం ఉన్న భారతదేశంలోని కొన్ని ప్రత్యేక ప్రదేశాలకు ట్రిప్ ప్లాన్ చేస్తే అద్భుతమైన అనుభవం పొందవచ్చు.

Update: 2025-08-13 15:45 GMT

1. ఝాన్సీ – రాణి లక్ష్మీబాయి స్మారక చిహ్నం

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో రాణి లక్ష్మీబాయి స్మారక చిహ్నం, ఆమె వీరత్వానికి ప్రతీక. దగ్గర్లోనే ఉన్న ఝాన్సీ కోటను కూడా తప్పక చూడాలి.

2. కోల్‌కతా – విక్టోరియా మెమోరియల్

బ్రిటిష్ పాలనను గుర్తు చేసే విక్టోరియా మెమోరియల్, భారత చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగింది. ఇండియన్ మ్యూజియం వంటి ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు.

3. అహ్మదాబాద్ – సబర్మతి ఆశ్రమం

మహాత్మా గాంధీ నివాసం, క్విట్ ఇండియా ఉద్యమానికి కేంద్రబిందువు అయిన సబర్మతి ఆశ్రమం, దేశ చరిత్రకు సాక్ష్యం.

4. మహారాష్ట్ర – రాజ్‌గఢ్ కోట & ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయం

రాజ్‌గఢ్ కోటలో శివాజీ మహారాజ్ చరిత్రను ఆస్వాదించండి. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియాన్ని కూడా సందర్శించండి.

5. పూణే – శనివార్ వాడా

మరాఠా సామ్రాజ్య చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం అయిన శనివార్ వాడాను చూడండి.

6. ఢిల్లీ – కుతుబ్ మినార్, ఇండియా గేట్, ఎర్రకోట

స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఢిల్లీలోని ఈ ప్రతిష్టాత్మక ప్రదేశాలను సందర్శించడం ప్రత్యేక అనుభూతి ఇస్తుంది.

ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్‌తో కానీ వెళ్తే, దేశ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటం గురించి చర్చించుకునే అవకాశం దొరుకుతుంది. పిల్లలకు నేరుగా ఈ చారిత్రక ప్రదేశాలను చూపడం ద్వారా వారికి మరపురాని అనుభవం కల్పించవచ్చు.

Tags:    

Similar News