Health Tips: నిద్రలేవగానే నడుంనొప్పి బాధిస్తుందా.. అయితే దీనిని మార్చాల్సిందే..!

Health Tips: మంచంపై ఉన్న పరుపు వ్యాలిడిటీ అయిపోయిందని అర్థం. చెడ్డ పరుపుపై పడుకోవడం వల్ల రోజురోజుకి ఆరోగ్యం దిగజారుతుంది.

Update: 2022-12-01 04:30 GMT

Health Tips: నిద్రలేవగానే నడుంనొప్పి బాధిస్తుందా.. అయితే దీనిని మార్చాల్సిందే..!

Health Tips: ఉదయం నిద్ర లేచిన వెంటనే నడుంనొప్పి బాధిస్తే మీరు కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. మంచంపై ఉన్న పరుపు వ్యాలిడిటీ అయిపోయిందని అర్థం. చెడ్డ పరుపుపై పడుకోవడం వల్ల రోజురోజుకి ఆరోగ్యం దిగజారుతుంది. అయితే పరుపు వ్యాలిడిటీ అయిపోయిందని ఐదు లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. వీటిని గమనించి పాత పరుపులని తీసివేసి కొత్తవి వేసుకోవాలి.

వింత వాసన

మీ పరుపు నుంచి దుర్వాసన వచ్చినా లేదా పదేపదే తుమ్ములు వచ్చినా మీ పరుపు వైరస్లు, బ్యాక్టీరియాలకు నిలయంగా మారిందని అర్థం. ఈ పరిస్థితిలో పరుపులని మార్చాలి. లేదంటే అనారోగ్యానికి గురవుతారు.

శరీరం వేడెక్కడం

మంచంపై పడుకున్న తర్వాత వేడిగా అనిపించినా, చెమట పట్టినా పరుపు దాని సహజ లక్షణాలను కోల్పోయిందని అర్థం. మీ గదిలో ఉష్ణోగ్రత చాలా వేడిగా లేదా చల్లగా ఉండటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది.

స్ప్రింగ్‌ యాక్షన్

కొన్ని పరుపులలో స్ప్రింగ్స్‌ అమర్చబడి ఉంటాయి. ఇవి శరీర బరువుకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటాయి. వీటిపై పడుకున్నప్పుడు యాక్షన్‌ లేకపోతే వ్యాలిడిటీ అయిపోయిందని అర్థం. వెంటనే కొత్తది మార్చుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

వెన్ను, భుజం నొప్పి

ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత భుజాలు, వెన్ను నొప్పిగా అనిపిస్తే పరుపు మీ బరువుకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోలేక పోతుందని అర్థం. వెంటనే కొత్తది మార్చుకోవాలి.

పరుపు వ్యాలిడిటీ

అన్ని వస్తువుల మాదిరి పరుపుకి కూడా నిర్ణీత వయసు ఉంటుంది. సాధారణంగా పరుపులని 7 సంవత్సరాలు ఉపయోగిస్తారు. కొంతమంది 10 సంవత్సరాలు ఉపయోగిస్తారు. అయితే 10 సంవత్సరాల తర్వాత వాటిని అన్ని ఖర్చులతో మార్చాలి. లేదంటే అవి మీకు శాశ్వత వెన్నునొప్పిని కలిగిస్తాయి. దీని వల్ల మీకు తక్కువ లాభం ఎక్కువ నష్టం జరుగుతుంది.

Tags:    

Similar News