స్థూలకాయంతో బాధపడుతున్నారా..!

Update: 2019-08-07 10:33 GMT

స్థూలకాయం బాధపడుతున్నారా.. అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఊబకాయం జన్యుపరంగా సంక్రమించే ప్రమాదం ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక వ్యక్తి యొక్క బీఎంఐ 25-29 మధ్యలో ఉంటే అధిక బరువుగా భావిస్తారు. అలాగే బీఎంఐ 30 మరియు 40 మధ్య ఉంటే స్థూలకాయంగా భావిస్తారు. ఊబకాయం.. జీవితంలో మధుమేహం, గుండె వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్లు, స్ట్రోక్ వంటి వివిధ రకాల వ్యాధులకు దారితీసే అవకాశం ఉంది.

ఈ సమస్యల బారిన పడకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు. ఊబకాయంతో బాధపడుతున్న వారు రోజూ జాగింగ్‌ చేయడం మంచిది. రోజూ వాకింగ్ చేస్తే బీఎంఐ ఆరోగ్యకరంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.రోజు చేసే వాకింగ్ స్థూలకాయం తగ్గించేందుకు చక్కటి మార్గం. ఆరోగ్యకరమైన డైటింగ్ అలవాటుతో పాటు వారంలో నాలుగు నుంచి ఐదు రోజులు జిమ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. రోజుకు 30 నుంచి 45 నిమిషాల పాటు జిమ్ చేయుట వలన అధిక బరువు తగ్గే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

Tags:    

Similar News