Cucumber Side Effects : కీరదోసకాయ అమృతమే.. కానీ ఈ సమస్యలు ఉంటే మాత్రం విషంతో సమానం
కీరదోసకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఎండాకాలంలో శరీరానికి చలువ చేయడానికి, బరువు తగ్గడానికి చాలా మంది కీరదోసను ఇష్టంగా తింటారు.
Cucumber Side Effects : కీరదోసకాయ అమృతమే.. కానీ ఈ సమస్యలు ఉంటే మాత్రం విషంతో సమానం
Cucumber Side Effects : కీరదోసకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఎండాకాలంలో శరీరానికి చలువ చేయడానికి, బరువు తగ్గడానికి చాలా మంది కీరదోసను ఇష్టంగా తింటారు. ఇందులో దాదాపు 95 శాతం నీరు ఉండటం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. విటమిన్ కె, సి, పొటాషియం వంటి పోషకాలు ఇందులో మెండుగా ఉన్నాయి. అయితే, ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కీరదోసకాయను తినడం వల్ల అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. అసలు ఎవరెవరు కీరదోసకు దూరంగా ఉండాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు జాగ్రత్త: ఆయుర్వేదం ప్రకారం, కీరదోసకాయ శరీరానికి చలువ చేస్తుంది. అయితే, ఇప్పటికే జలుబు, దగ్గు, ఆస్తమా లేదా సైనస్ వంటి సమస్యలతో బాధపడేవారు కీరదోస తింటే ఆ సమస్యలు మరింత ముదిరే అవకాశం ఉంది. దీనిలోని శీతల గుణం కఫాన్ని పెంచుతుంది. అలాగే, కీళ్ల నొప్పులు లేదా శరీరంలో వాపులు ఉన్నవారు కూడా కీరదోసకు దూరంగా ఉండటం మంచిది. ఇది శరీరంలో వాతాన్ని పెంచి నొప్పులు ఎక్కువయ్యేలా చేస్తుంది.
జీర్ణక్రియ, గ్యాస్ సమస్యలు: కీరదోసకాయలో కుకుర్బిటాసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణక్రియ సున్నితంగా ఉన్నవారిలో గ్యాస్, కడుపు ఉబ్బరం లేదా అజీర్తి వంటి సమస్యలను కలిగిస్తుంది. కొందరికి కీరదోస తిన్న తర్వాత తేన్పులు రావడం లేదా కడుపులో అసౌకర్యంగా అనిపించడం వెనుక కారణం ఇదే. అందుకే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు దీనిని మితంగా తీసుకోవాలి లేదా పూర్తిగా మానేయాలి.
డయాబెటిస్, కిడ్నీ సమస్యలు: సాధారణంగా మధుమేహం ఉన్నవారికి కీరదోసకాయ మంచిదే. కానీ, ఇన్సులిన్ లేదా గ్లూకోజ్ తగ్గించే మందులు వాడేవారు కీరదోస గింజలను ఎక్కువగా తింటే.. రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పడిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల తలతిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇకపోతే, కీరదోసలో నీటి శాతం ఎక్కువ కాబట్టి, కిడ్నీ సమస్యలు ఉన్నవారు లేదా తరచుగా మూత్ర విసర్జన సమస్య ఉన్నవారు దీనిని ఎక్కువగా తింటే రాత్రిపూట నిద్రకు భంగం కలగవచ్చు.
తినడానికి సరైన సమయం ఏది?
ఆరోగ్య నిపుణులు కీరదోసకాయను రాత్రిపూట లేదా భోజనం చేసిన వెంటనే తినవద్దని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. రాత్రిపూట తింటే నిద్రలో అసౌకర్యం కలుగుతుంది. ఎల్లప్పుడూ పగటిపూట లేదా సాయంత్రం లోపే కీరదోసను స్నాక్ లాగా తీసుకోవడం ఉత్తమం.