నిమ్మ, నువ్వుల నూనెతో కాళ్ళ నొప్పులు మటు మాయం..!

Update: 2019-07-27 13:14 GMT

మోకాళ్లు నొప్పులు వస్తే ఇక ఆ సమస్యను గురించి వేరే చెప్పక్కర్లేదు. కొన్ని చిట్కాలు పాటిస్తే ఆ సమస్యల నుంచి ఉపసమనం పొందవచ్చు అంటున్నారు నిపుణులు. నిమ్మ, నువ్వుల నూనెతో కాళ్ళ నొప్పులను నివారించవచ్చు. ఇందుకోసం రెండు నిమ్మకాయలు చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి, ఒక చిన్న గుడ్డముక్కను కట్ చేసి చిన్న నిమ్మకాయ ముక్కలను ఉంచి టైట్‌గా కట్టాలి. దీన్ని వెచ్చటి నువ్వుల నూనెలో ఉంచాలి. అలా ముంచిన గుడ్డను ఐదు నుంచి పది నిమిషాల వరకు మోకాళ్ళపై ఉంచాలి.

రోజుకు రెండుసార్లు నొప్పి తగ్గేంతవరకు ఇలా చేయాలి. అలాగే రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళలో నిమ్మకాయ కలుపుకుని తాగితే కూడా చాలా మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ ఎ, బి, సి1, బి6, మెగ్నీషియం, పాస్పరస్, క్యాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు నిండి ఉంటాయి.

అధిక క్యాల్షియం మరియు విటమిన్ సిలు ఆరోగ్యంగా మెరుగ్గా ఉండడానికి సహాయపపడుతుంది. ఎముకల వ్యాధి రాకుండా కాపాడుతుంది. నిమ్మలోని ఎనన్షియల్ ఆయిల్ రక్తనాళాలకు విశ్రాంతి ఇస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తిని ఉత్పత్తి చేస్తుంది. జాయింట్, నరాల నొప్పికి ఎంతో దోహదం చేస్తుంది. 

Tags:    

Similar News