Lifestyle: వెండి పాత్రల్లో నీరు తాగితే ఏమవుతుందో తెలుసా.?

Lifestyle: వెండి పాత్రలు ఇంట్లో ఉండడాన్ని స్టేటస్‌ సింబల్‌గా భావిస్తుంటారు. కొన్ని ఇళ్లలో వెండి గ్లాసులో నీటిని తాగుతుంటారు.

Update: 2025-01-25 05:45 GMT

Lifestyle: వెండి పాత్రల్లో నీరు తాగితే ఏమవుతుందో తెలుసా.? 

Lifestyle: వెండి పాత్రలు ఇంట్లో ఉండడాన్ని స్టేటస్‌ సింబల్‌గా భావిస్తుంటారు. కొన్ని ఇళ్లలో వెండి గ్లాసులో నీటిని తాగుతుంటారు. అయితే కేవలం స్టేటస్‌ సింబల్‌కు మాత్రమే పరిమితం కాకుండా వెండి పాత్రల్లో నీటిని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని మీకు తెలుసా.? ఆయుర్వేదం కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. ఇంతకీ వెండి గ్లాసులో నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల ఏంటో ఇప్పుడు తెలుసుకుందం.

* వెండి పాత్రలో నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుందని, తద్వారా శరీరం యొక్క రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుందని చెబుతుంటారు. అలాగే వెండి శరీరం pH సమతుల్యతను మెరుగుపరుస్తుంది. పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లలో ఆర్థరైటిస్, డిమెన్షియా, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను దూరం చేయడంలో దోహదపడుతుంది.

* ఇక వెండి పాత్రల్లో ఉన్న నీటిలో ఉన్న బ్యాక్టీరియా నశిస్తుంది. ఇది నీటిని శుద్ధి చేస్తుంది. ప్లాస్టిక్‌ బాటిల్స్‌తో పోల్చితే సిల్వర్‌ పాత్రల్లో నీటిని వాడడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

* వెండి గ్లాసులో నిల్వ చేసిన నీటిలో బ్యాక్టీరియా పెరగదని నిపుణులు చెబుతున్నారు.

* సిల్వర్‌ పాత్రల్లో నిల్వ చేసిన నీరు ఎక్కవ కాలం తాగడానికి సురక్షితంగా ఉంటుంది. వెండిలోని క్రిమినాశక లక్షణాలు, టైఫాయిడ్ వంటి నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ముఖ్యంగా చిన్నారులకు ఎంతో మేలు చేస్తుంది.

* సాధారణంగా ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో నీటిని నిల్వ చేస్తే ఫంగస్‌, బ్యాక్టీరియా వంటివి పెరిగే అవకాశం ఉంటుంది. అయితే సిల్వర్‌ పాత్రల్లో నీటిని స్టోర్‌ చేస్తే ఇలాంటి సమస్యల నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్యుల చెప్పే విషయాలనే పాటించాలి.

Tags:    

Similar News