రాగి పాత్రల్లోని నీరు తాగితే ఎంత మేలో తెలుసా?

Update: 2019-09-02 15:34 GMT

పాత పద్దుతులు అరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి, రాగి పాత్రల్లోని నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయం చాలా పరిశోధనల్లో వెల్లడైంది. రాగి పాత్రల్లో నీరు సహజంగానే శుద్ధి అవుతుంది. వాటిలోని సూక్ష్మజీవులు నాశనం అవుతాయి. ఆ పాత్రలోని నీరు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఓ సారి చూద్దాం...

రాత్రంతా రాగి పాత్రలో నిల్వ ఉంచి వాటిని ఉదయాన్నే తాగడం వల్ల వాత, పిత్త, కఫ దోషాలు రాకుండా ఉంటాయి. శరీరంలోని వివిధ అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. రాగి పాత్రల్లోని నీరు కడుపులో మంట తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థలో ఏర్పడే అల్సర్లు తగ్గడానికి, వాటి పనితీరు మెరుగవడానికి ఇది సహకరిస్తుంది. కాలేయం, కిడ్నీల పనితీరు మెరుగుపరుస్తుంది. ఆహారంలోని పోషకాలు శరీరానికి అందుతాయి. బరువు తగ్గాలనుకునే వారు రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం ప్రయోజనకరం.

శరీరంలోని కొవ్వు కరగడానికి, జీర్ణక్రియ పనితీరు మెరగుపడటానికి రాగి పాత్రలు దోహదం చేస్తాయి. ఆ నీటి ప్రభావం వల్ల తనకు అవసరమైన వాటిని మాత్రమే ఉంచుకొని మిగతా వాటిని శరీరం బయటకు పంపుతుంది. గాయాలు త్వరగా మానడానికి కూడా ఇది ఉపకరిస్తుంది. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా కాపాడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడే ఔషదం రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిలో ఉంటుంది. 

Tags:    

Similar News