కరివేపాకు వలన ఆ సమస్యలు తగ్గే అవకాశం

కరివేపాకు వలన ఆ సమస్యలు తగ్గే అవకాశం కరివేపాకు వలన ఆ సమస్యలు తగ్గే అవకాశం

Update: 2019-09-26 03:51 GMT

కరివేపాకు.. వంటలో వాడితే.. ఆ వంట గుమగుమలాడుతుంది. వంటలో కలిపిన కరివేపాకు తినటం వలన.. చాలా ఆరోగ్య ప్రయోజనాలను కల్గుతాయి అంటున్నారు ఆరోగ్యనిపుణులు. రోజు భోజనంలో కలిపిన కరివేపాకు తినటం వలన మూత్రపిండ సమస్యలు తగ్గుతాయి అంటున్నారు నిపుణులు. భోజనంలో కలిపిన కరివేపాకు ఆకులను తినటానికి ఇష్టపడకపోతే, రోజుకు రెండు సార్లు కరివేపాకు రసాన్ని తాగటం వలన కూడా మూత్రపిండ సమస్యలు తగ్గే అవకాశం ఉందంటున్నారు. మూత్రపిండాలలో రాళ్లు కలిగి ఉండే వారు కూడా కరివేపాకు రసాన్ని తాగితే మంచి ఫలితాలు వస్తాయి అంటున్నారు నిపుణులు.

కరివేపాకు ఆకులను నలిపి, మజ్జిగలో లేదా నీటిలో కలుపుకొని తాగటం వలన అజీర్ణం నుండి ఉపశమనం పొందుతారు. కరివేపాకు ఆకులను ఎండబెట్టి లేదా వేయించి, పొడి చేసి రోజు రెండు చెంచాలు తీసుకోవటం వలన జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కరివేపాకు ఆకులు మరియు జీలకర్రను కలిపి బాగా దంచి.. ఈ మిశ్రమాన్ని.. పాలలో కలుపుకొని తాగటం వలన అజీర్ణం నుండి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు నిపుణులు.

కరివేపాకు ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందం మెరుగుపరుచుకోటానికి కూడా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. కరివేపాకు కలిపిన వేడి చేసిన నూనెను రోజు తలపై మసాజ్ చేయటం ద్వారా జుట్టు పెరుగుదల మెరుగుపడుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

Tags:    

Similar News