Diabetes : చిప్స్ ఎక్కువగా తింటున్నారా ? అయితే ఆ ప్రమాదం 20% పెరుగుతుందట
చిప్స్.. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన స్నాక్. ఖాళీగా ఉన్నప్పుడో, సినిమాలు చూస్తున్నప్పుడో, ప్రయాణాల్లోనో మన చేతులు చిప్స్ ప్యాకెట్ల వైపు వెళ్తుంటాయి.
Diabetes : చిప్స్ ఎక్కువగా తింటున్నారా ? అయితే ఆ ప్రమాదం 20% పెరుగుతుందట
Diabetes : చిప్స్.. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన స్నాక్. ఖాళీగా ఉన్నప్పుడో, సినిమాలు చూస్తున్నప్పుడో, ప్రయాణాల్లోనో మన చేతులు చిప్స్ ప్యాకెట్ల వైపు వెళ్తుంటాయి. కానీ, ఈ రుచికరమైన అలవాటు మన ఆరోగ్యానికి ఎంత హానికరమో తెలుసా ? హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన ఒక కొత్త అధ్యయనంలో చిప్స్ ఎక్కువగా తినడం వల్ల ఒక తీవ్రమైన వ్యాధి వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని తేలింది. వారానికి కేవలం 3 సార్లు చిప్స్ తిన్నా వచ్చే ప్రమాదం ఎంత? అసలు ఈ సమస్యకు చిప్స్‌కు ఉన్న సంబంధం ఏంటి? పూర్తి వివరాలను తెలుసుకుందాం.
హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం వారానికి మూడు సార్లు చిప్స్ తింటే, టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 20 శాతం పెరుగుతుంది. ఒకవేళ ఐదు సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు తింటే, ఈ ప్రమాదం ఏకంగా 27 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు మూడు దశాబ్దాలకు పైగా 205,000 మందికి పైగా ఆరోగ్య వివరాలను విశ్లేషించారు. దీనివల్ల డెంగ్యూ లాగా కాకపోయినా దీర్ఘకాలికంగా చిప్స్ వల్ల వచ్చే సమస్యలు ఇవి.
అయితే, ఈ ప్రమాదానికి కారణం కేవలం బంగాళాదుంప కాదు. అది వండే విధానం అని పరిశోధకులు స్పష్టం చేశారు. ఉదాహరణకు, ఉడికించిన, కాల్చిన లేదా మెత్తగా చేసిన బంగాళాదుంపలు తింటే డయాబెటిస్ వచ్చే ప్రమాదం కేవలం 5 శాతం మాత్రమే పెరుగుతుంది. అంటే, ప్రమాదం దాదాపుగా ఉండదు. దీనికి ప్రధాన కారణం చిప్స్‌ను డీప్ ఫ్రై చేయడం. బంగాళాదుంపను అధిక ఉష్ణోగ్రత వద్ద నూనెలో వేయించడం వల్ల దానిలో ఉండే ఫైబర్, విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలు చాలావరకు నాశనమవుతాయి. నూనె, అధిక ఉష్ణోగ్రత, ఎక్కువ కార్బోహైడ్రేట్లు కలగలిసి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. దీనివల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. ఇది టైప్-2 డయాబెటిస్‌కు ప్రధాన కారణం.
చిప్స్ వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు
చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్‌ను ఎక్కువగా తినడం వల్ల డయాబెటిస్ మాత్రమే కాదు, ఇంకా చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇందులో అధిక కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థకు ఇబ్బందులు కలుగుతాయి. అజీర్తి, కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు. ఫ్రెంచ్ ఫ్రైస్‌లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ మెదడు పనితీరును అడ్డుకుంటాయి. దీనివల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, అల్జీమర్స్ వంటి వ్యాధుల లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. శరీర బరువు విపరీతంగా పెరగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
చిన్న మార్పు, పెద్ద ప్రయోజనం
ఈ ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ఒక చిన్న మార్పు చాలు అంటున్నారు నిపుణులు. చిప్స్ తినే అలవాటుకు బదులుగా తృణధాన్యాలను ఆహారంలో చేర్చుకోవడం మంచిది. పరిశోధన ప్రకారం.. కేవలం మూడు సార్లు చిప్స్ స్థానంలో తృణధాన్యాలు తింటే, డయాబెటిస్ ప్రమాదం 8% నుంచి 19% వరకు తగ్గుతుంది. కాబట్టి, ఈసారి చిప్స్ ప్యాకెట్ తీసుకోబోయే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఆ క్షణంలో ఆ రుచి బాగున్నా, అది మీ దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.