శొంఠి పొడిని నీళ్లలో కలిపి తాగితే....

Update: 2019-08-01 15:11 GMT

వర్షకాలం మెుదలైంది దీంతో జలుబు లాంటి వ్యాదులు కూడా జనాన్ని వణికిస్తున్నాయి. వీటి నుంచి ఉపశమనం పోందడానికి రకరకాలైన ఔషదాలను వాడుతుంటాం. అయితే జలుబు బాధను పోగొట్టుకోవడానికి శొంఠి పొడిని నీళ్లలో కలిపి మరగబెట్టి తాగితే దాని నుంచి విముక్తి పోందవచ్చు. మరుగుతున్న టీ లేదా కాఫీలో ఈ పొడిని కొద్దిగా కలిపి తాగితే ప్రయోజనం ఉంటుంది. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్కను చూర్ణం చేసుకొని భద్రపరుచుకోవాలి.

కప్పు నీటిని మరిగించి, దానిలో పావు చెంచా పొడిని వేసి టీలో కాచుకోవాలి. వాటిలో ఎనిమిది తులసి ఆకులు వేసి వేడివేడిగానే తాగాలి. ఇలా రోజు చేయడం వల్ల వర్షాకాలంలో వచ్చే అనారోగ్యాల నుంచి తప్పించుకోవచ్చు. కప్పు పాలల్లో కొద్దిగా శొంఠి పొడి వేసి కలిపి వేడి చేసి కొద్దిగా తేనె కలిపి తాగాలి. శొంఠి, పిప్పళ్లు, మిరియాలను మెత్తాగా పొడి చేసి సమభాగాల్లో కలుపుకోవాలి. దీఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జర్వం, దగ్గు, జలుబు, అలర్జీని నిరోధిస్తుంది. ఇలా ఇంటి చిట్కాలతోనే జలుబు సులువుగా తగ్గించుకోవచ్చు. 

Tags:    

Similar News