Egg Shells: గుడ్డు పెంకులు – పారేయకండి, ఉపయోగించండి!

చాలామంది గుడ్లు తిన్న తర్వాత పెంకులను నేరుగా చెత్త బుట్టలో వేసేస్తారు. కానీ నిపుణుల ప్రకారం, గుడ్డు పెంకులు మన ఆరోగ్యం, అందం, ఇంటి పనులలో అద్భుతమైన ఉపయోగాలు కలిగి ఉంటాయి.

Update: 2025-08-14 14:15 GMT

Egg Shells: గుడ్డు పెంకులు – పారేయకండి, ఉపయోగించండి!

చాలామంది గుడ్లు తిన్న తర్వాత పెంకులను నేరుగా చెత్త బుట్టలో వేసేస్తారు. కానీ నిపుణుల ప్రకారం, గుడ్డు పెంకులు మన ఆరోగ్యం, అందం, ఇంటి పనులలో అద్భుతమైన ఉపయోగాలు కలిగి ఉంటాయి.

పోషకాలు పుష్కలంగా

గుడ్డు పెంకుల్లో బోరాన్, మెగ్నీషియం, రాగి, ఇనుము, సల్ఫర్, జింక్, కాల్షియం కార్బోనేట్‌ వంటి ఖనిజాలు ఉంటాయి. వీటిని పొడి చేసి శుభ్రపరిచే ఏజెంట్‌గా, సేంద్రీయ ఎరువుగా వాడవచ్చు.

అందం కోసం

ముడతలు తొలగించడానికి: గుడ్డు పెంకులను కడిగి ఎండబెట్టి పొడి చేసి, తేనె లేదా పెరుగుతో కలిపి ముఖానికి స్క్రబ్ చేయండి.

జుట్టు మెరుపు కోసం: పెంకుల పొడిని పెరుగులో కలిపి జుట్టుకు 20 నిమిషాలు అప్లై చేయండి.

పసుపు దంతాలు తెల్లగా: ఒక టీస్పూన్ పెంకుల పొడి, చిటికెడు బేకింగ్ సోడా, కొబ్బరి నూనెతో పేస్ట్ తయారు చేసి వాడండి.

గోర్లు బలంగా: పెంకుల పొడిని నెయిల్ పాలిష్‌తో కలిపి అప్లై చేయండి.

వేళ్లు మృదువుగా: ఫ్రీజ్ చేసిన పెంకులను వేళ్లపై స్క్రబ్ చేయండి.

ఇంటి పనుల్లో

కాలిన పాత్రలు, సింక్ మురికిని శుభ్రం చేయడానికి పెంకుల పొడిని బ్రష్‌తో వాడండి.

కుండీలలో ఎరువుగా వేసి నేల నాణ్యతను పెంచి, నత్తలు, స్లగ్స్‌ను దూరం చేయండి.

గుడ్డు పెంకులు చిన్న చిన్న మార్పులతో మన ఇంటికి, ఆరోగ్యానికి, అందానికి ఉపయోగపడతాయి. ఇకపై అవి చెత్తలో కాకుండా పనిలో పెట్టుకోండి!

Tags:    

Similar News