క్యాన్సర్ ముప్పు తగ్గాలంటే....

Update: 2019-07-30 15:45 GMT

ఇప్పుడు చాలా మందిని భయపెడుతున్న వ్యాధి క్యాన్సర్. ఈ మహమ్మారితో చాలా మంది ప్రాణాలను కోల్పోయారు. అయితే క్యాన్సర్ నివారించడానికి మనం తినే తిండి మీదే ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా. జీర్ణకోశ క్యాన్సర్లన్నీ మనం తీసుకునే ఆహారంతోనే అధారపడి ఉంటాయి. క్యాన్సర్ కారక పదార్థాలు కణాల్లో మార్పులకు దారితీస్తాయి. ప్రస్తుతం కాలంలో మన ఆహార అలవాట్లు బాగా మారిపోయాయి. సంప్రదాయ ఆహార పదార్థాలు తినటం తగ్గిపోయింది.

వారంలో కనీసం ఒక్కసారైన చేపను తినేవారితో పోలిస్తే , మూడు సార్లు తీసుకునేవారిలో పేగు క్యాన్సర్‌ ముప్పు 12 శాతం తక్కువగా ఉందని ఒక పరిశోధనలో తేలింది.చేపల్లో ఉండే కొవ్వు ఆమ్లాలు శరీరంలో వాపును తగ్గిస్తాయని అద్యయనం పేర్కొంది నూనె అధికంగా ఉండే సాల్మన్‌, మాకరెల్‌ చేపల కంటే ఇతర చేపలు మరింతగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నయంట. వారంలో మూడు సార్లు చేపను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్‌ ముప్పు బాగాగ తగ్గుతుందని వెల్లడైంది.యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌, ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ క్యాన్సర్‌ (ఐఏఆర్‌సీ) సంయుక్తంగా చేపట్టిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. 

Tags:    

Similar News