Orange Peel : తొక్కే కదా అని తీసి పారేస్తున్నారా..ఇందులో ఉన్న పవర్ తెలిస్తే కళ్లు తేలేస్తారు
Orange Peel : నారింజ పండు ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలుసు. అయితే ఆ పండు పైన ఉండే తొక్క కూడా ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది.
Orange Peel : తొక్కే కదా అని తీసి పారేస్తున్నారా..ఇందులో ఉన్న పవర్ తెలిస్తే కళ్లు తేలేస్తారు
Orange Peel : నారింజ పండు ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలుసు. అయితే ఆ పండు పైన ఉండే తొక్క కూడా ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. దీనిని ఎండబెట్టి పొడి రూపంలో లేదా టీ రూపంలో తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే పీచు పదార్థం మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలను తరిమికొడుతుంది. రోజూ నారింజ తొక్క పొడిని నీటితో తీసుకుంటే మీ పొట్ట తేలికగా మారుతుంది.
చర్మ సౌందర్యానికి నారింజ తొక్కే
మొటిమలు, మచ్చలు తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే రసాయన క్రీముల కంటే నారింజ సిప్ప పొడి ఎంతో మేలు. ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. ఈ పొడిని పెరుగు లేదా తేనెతో కలిపి ఫేస్ ప్యాక్ లా వేసుకుంటే ముఖంపై ముడతలు తగ్గి, యవ్వనంగా కనిపిస్తారు. అలాగే తలలో చుండ్రు సమస్య ఉన్నవారు నారింజ తొక్క పొడిని కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది.
బరువు తగ్గించడంలోనూ తొక్కే తోపు
బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి నారింజ తొక్క టీ ఒక గొప్ప వరమని చెప్పాలి. ఈ టీ తాగడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరంలో మెటబాలిజంను వేగవంతం చేసి, కొవ్వు కరగడానికి సహాయపడతాయి. కేవలం బరువు తగ్గడమే కాకుండా, శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఈ తొక్క కీలక పాత్ర పోషిస్తుంది. శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుంచి ఇది మనల్ని కాపాడుతుంది.
నోటి దుర్వాసన చెక్.. పాదాల మెరుపు
నారింజ తొక్కలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెండుగా ఉంటాయి. నోటి దుర్వాసనతో ఇబ్బంది పడేవారు చిన్న నారింజ తొక్క ముక్కను నమిలితే బ్యాక్టీరియా నశించి నోరు తాజాగా మారుతుంది. అలాగే, పాదాలు, చేతులపై పేరుకుపోయిన మురికిని వదిలించుకోవడానికి నారింజ తొక్కను నేరుగా చర్మంపై రుద్దితే అది ఒక నేచురల్ స్క్రబ్ లా పనిచేస్తుంది. దీనివల్ల చర్మం మృదువుగా, సుందరంగా తయారవుతుంది. కాబట్టి ఇకపై నారింజ తొక్కను పారేయకుండా జాగ్రత్తగా భద్రపరచుకోండి.