Nail Biting : గోర్లు కొరుకుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే

Nail Biting : గోర్లు కొరుకుకోవడం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, ఇది ఒక అనారోగ్య లక్షణం కూడా. వైద్య పరిభాషలో దీనిని ఒనికోఫాగియా అని పిలుస్తారు.

Update: 2026-01-15 09:30 GMT

Nail Biting : గోర్లు కొరుకుకోవడం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, ఇది ఒక అనారోగ్య లక్షణం కూడా. వైద్య పరిభాషలో దీనిని ఒనికోఫాగియా అని పిలుస్తారు. సాధారణంగా భయం, ఆందోళన, ఒత్తిడి లేదా విసుగు చెందినప్పుడు మనుషులు తెలియకుండానే గోర్లను నోట్లో పెట్టుకుంటారు. అయితే, మన చేతులు రోజంతా రకరకాల వస్తువులను తాకుతుంటాయి. దీనివల్ల గోర్ల లోపల మన కంటికి కనిపించని వేల సంఖ్యలో బ్యాక్టీరియా, వైరస్‌లు మరియు మురికి చేరుతాయి. మీరు గోరు కొరికిన ప్రతిసారి ఆ విషపూరిత బ్యాక్టీరియా నేరుగా మీ కడుపులోకి వెళ్తుందని ఆర్‌ఎంఎల్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ సుభాష్ గిరి హెచ్చరిస్తున్నారు.

పొట్ట సోంకులు, జీర్ణ సమస్యలు

గోర్ల ద్వారా శరీరంలోకి ప్రవేశించే ఈ కోలిఫామ్ బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు తీవ్రమైన పొట్ట ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. దీనివల్ల వికారం, వాంతులు, కడుపు నొప్పి, అతిసారం (డయేరియా) వంటి సమస్యలు వస్తాయి. చాలా కాలం పాటు ఈ అలవాటు కొనసాగితే జీర్ణవ్యవస్థ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. కేవలం పొట్టే కాదు, గోళ్ల చుట్టూ ఉండే చర్మం కూడా ఎర్రగా కమిలిపోయి పరోనిచియా అనే ఇన్ఫెక్షన్ సోకుతుంది. దీనివల్ల వేళ్లు వాపు రావడం, చీము పట్టడం వంటివి జరుగుతాయి.

పళ్లు, చిగుళ్లపై ప్రభావం

నిరంతరాయంగా గోర్లు కొరకడం వల్ల పళ్ళ పైన ఉండే ఎనామిల్ పొర దెబ్బతింటుంది. ఇది పళ్ళు బలహీనపడటానికి, చిగుళ్లలో వాపు, రక్తస్రావానికి దారితీస్తుంది. అంతేకాకుండా, పళ్ళ అమరిక దెబ్బతిని వంకరగా మారే అవకాశం కూడా ఉంది. గోర్ల ద్వారా నోట్లోకి చేరే బ్యాక్టీరియా వల్ల నోటి దుర్వాసన మరియు చిగుళ్ల వ్యాధులు చుట్టుముడతాయి.

ఈ అలవాటును ఎలా మానుకోవాలి?

గోర్లు కొరుకుటను ఆపడానికి ముందుగా మీరు ఎందుకు అలా చేస్తున్నారో గమనించాలి. ఒత్తిడి వల్ల అయితే యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకోవాలి. గోర్లను ఎప్పుడూ చిన్నగా కత్తిరించుకోవాలి, అప్పుడు కొరకడానికి వీలుండదు. అవసరమైతే చేతులకు చేదుగా ఉండే పదార్థాలను రాసుకోవడం లేదా చేతి వేళ్లకు బ్యాండేజ్ వంటివి చుట్టుకోవడం ద్వారా ఈ అలవాటును అదుపు చేయవచ్చు. పిల్లల్లో ఈ అలవాటు కనిపిస్తే వెంటనే వారిని మందలించకుండా, ప్రేమగా దాని వల్ల కలిగే నష్టాలను వివరించడం మంచిది.

Tags:    

Similar News