Health Tips: చెమట వాసనని తేలికగా తీసుకోవద్దు.. తీవ్రమైన వ్యాధుల లక్షణాలు..!

Health Tips: శరీరానికి చెమట పట్టడం సహజం. శరీర ఉష్ణోగ్రతను సరైన విధంగా మెయింటెన్ చేయడానికి చెమట పడుతుంది.

Update: 2022-12-02 13:01 GMT

Health Tips: చెమట వాసనని తేలికగా తీసుకోవద్దు.. తీవ్రమైన వ్యాధుల లక్షణాలు..!

Health Tips: శరీరానికి చెమట పట్టడం సహజం. శరీర ఉష్ణోగ్రతను సరైన విధంగా మెయింటెన్ చేయడానికి చెమట పడుతుంది. ఇది అందరికి జరుగుతుంది. కానీ చెమట వాసన అందరిలో ఒకేలా ఉండదు. చెమట వాసన వెనుక అనేక కారణాలు దాగి ఉన్నాయి. మీరు సెంటు పూసుకొని కవర్‌ చేద్దామన్నా దుర్వాసన దాగదు. చాలా మంది చెమట దుర్వాసనకు కారణం బ్యాక్టీరియా అని నమ్ముతారు. కానీ అది తప్పు. చెమట పట్టడం వెనుక గల కారణాలు అది ఏ వ్యాధులకు సంకేతమో ఈ రోజు తెలుసుకుందాం.

మధుమేహం

చెమట వాసన అనేది మధుమేహం లక్షణం కావచ్చు. ఈ వ్యాధిలో రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీని కారణంగా శరీరంలో మార్పులు జరుగుతాయి. చాలా సందర్భాలలో చెమట వాసన మొదలవుతుంది. మధుమేహం ఉన్నప్పుడు చెమటలో వేరే వాసన ఉంటుంది.

థైరాయిడ్

చెమటలు పట్టడం అనేది థైరాయిడ్ గ్రంధి అతి చురుగ్గా పనిచేయడానికి సంకేతం. థైరాయిడ్ గ్రంధి ఎక్కువగా పని చేస్తే చెమట ఎక్కువగా వస్తుంది. ఈ చెమట వాసన వేరే విధంగా ఉంటుంది.

ఒత్తిడి

ఒత్తిడి కారణంగా చెమట వాసన వస్తుంది. ఒత్తిడి ఉన్నప్పుడు విపరీతమైన చెమట వస్తుంది. దీనిని నియంత్రించాలనుకుంటే ఒత్తిడికి దూరంగా ఉండటం అవసరం.

మందులు

చాలా మంది ప్రతి చిన్న విషయానికి మందులు వాడుతున్నారు. మందుల వల్ల చెమట వాసన వస్తుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. అనవసరంగా ఎక్కువ మందులు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

తప్పుగా తినడం

తప్పుగా తినడం వల్ల చెమట దుర్వాసన వస్తుంది. పచ్చి వెల్లుల్లి, ఉల్లిపాయలు తినడం వల్ల చాలా మంది శరీరం దుర్వాసన వస్తుంది. మీరు ఇంతకు ముందు కంటే తక్కువ స్పైసీ ఫుడ్ తిని ఆపై ఎక్కువ స్పైసీ ఫుడ్ తినడం ప్రారంభిస్తే చెమటలో దుర్వాసనలో తేడాలు ఉంటాయి.

Tags:    

Similar News