Ramadan 2024: రంజాన్‌ సందర్భంగా డయాబెటిక్‌ పేషెంట్లు ఉపవాసం ఉంటున్నారా.. ఈ విషయాలు గుర్తంచుకోండి..!

Ramadan 2024: రంజాన్‌ సమయంలో డయాబెటిక్‌ పేషెంట్లు ఉపవాసం చేస్తే జాగ్రత్తగా ఉండాలి.

Update: 2024-03-12 13:00 GMT

Ramadan 2024: రంజాన్‌ సందర్భంగా డయాబెటిక్‌ పేషెంట్లు ఉపవాసం ఉంటున్నారా.. ఈ విషయాలు గుర్తంచుకోండి..!

Ramadan 2024: రంజాన్‌ సమయంలో డయాబెటిక్‌ పేషెంట్లు ఉపవాసం చేస్తే జాగ్రత్తగా ఉండాలి. సరైన డైట్‌ పాటించకపోతే హాస్పిటల్‌లో అడ్మిన్‌కావాల్సి ఉంటుంది. ఉపవాసం చేయడం తప్పుకాదు కానీ దానికి మీ ఆరోగ్యం సహకరించాలని గుర్తుంచుకోండి. మార్చి 12 నుంచి రంజాన్ మాసం ప్రారంభమైంది. ఇస్లాం మతంలో ఈ ముప్పై రోజులు చాలా పవిత్రమైనవి. ఈ సమయంలో రోజా అనే ఉపవాసం పాటించడం ఈ మతాన్ని అనుసరించే వారందరికీ అవసరం. అయితే అనారోగ్యంతో ఉంటే దీన్ని చేయవలసిన అవసరం లేదు. కానీ చాలా మంది డయాబెటిక్‌ పేషెంట్లు సైతం ఉపవాసం ఉంటారు. ఇలాంటి వారు ఎలాంటి డైట్‌ పాటించాలో ఈరోజు తెలుసుకుందాం.

తగినంత నిద్ర

మీరు ఎప్పుడూ రాజీ పడకూడని విషయాలలో ఒకటి నిద్ర. ముఖ్యంగా ఉపవాస సమయంలో తగినంత నిద్ర అవసరం. ఇది ఆహారం జీర్ణం కావడానికి సాయపడుతుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు తలెత్తవు.

హైడ్రేట్ చేసుకోవాలి

ఉపవాసం ఉండే మధుమేహ వ్యాధిగ్రస్తులకు డీహైడ్రేషన్ ఒక ప్రమాదం. అందుకే నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు, పుచ్చకాయ, తక్కువ చక్కెరతో తాజా పండ్ల రసం, రోజ్ సిరప్ తరచుగా తీసుకుంటూ ఉండాలి. దీంతో రోజంతా శరీరంలో నీటి కొరత ఉండదు.

ప్రోబయోటిక్స్ చేర్చండి

భోజనం తర్వాత ఒక చెంచా పెరుగు తీసుకోండి. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సాయపడుతుంది. ఉపవాస సమయంలో అసిడిటీ అవకాశాలను తగ్గిస్తుంది.

చక్కెర రహిత పానీయాలు

ఇఫ్తార్ సమయంలో చక్కెర రహిత హైడ్రేటింగ్ డ్రింక్స్‌ తాగండి. ఆపై రాత్రి భోజనానికి వెళ్లండి. సమోసా, కబాబ్, పూరీ వంటి కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తినకూడదని గుర్తుంచుకోండి. ఆకు కూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, స్కిన్‌లెస్ చికెన్, ఫిష్ వంటి లీన్ మాంసాన్ని తీసుకోవాలి.

సమతుల్య భోజనం

సెహ్రీ సమయంలో పండ్లు, కూరగాయలు, రొట్టె, చిక్కుళ్లు, తక్కువ చక్కెర కలిగిన తృణ ధాన్యాలు, పాలు, రసంతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోండి.

రక్తంలో చక్కెర చెక్‌ చేస్తూ ఉండండి

రక్తంలో చక్కెర శాతం తనిఖీ చేస్తూ ఉండాలి. సమస్యల విషయంలో ఆరోగ్య నిపుణుల నుంచి సలహాలు తీసుకోండి. అలాగే ఇన్సులిన్ తీసుకునే వ్యక్తులు ఉపవాసానికి ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

Tags:    

Similar News