ఈ వ్యాధి వృద్ధులలో మాత్రమే కాదు యువకులలో కూడా కనిపిస్తోంది.. జాగ్రత్త..!

ఈ వ్యాధి వృద్ధులలో మాత్రమే కాదు యువకులలో కూడా కనిపిస్తోంది.. జాగ్రత్త..!

Update: 2022-02-03 07:30 GMT

ఈ వ్యాధి వృద్ధులలో మాత్రమే కాదు యువకులలో కూడా కనిపిస్తోంది.. జాగ్రత్త..!

Dementia: సాధారణంగా వయసు పైబడుతున్న కొద్ది జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. ఈ ప్రభావం ఎక్కువగా వృద్ధులలో కనిపిస్తుంది. కానీ ఇప్పుడు యువకులు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మొదటగా చిన్న చిన్నవిషయాలను మరిచిపోతారు. అప్పుడు ఈ సమస్యని అంతగా పట్టించుకోరు కానీ రాను రాను ఈ సమస్య అధికమవుతుంది. వారు చేసే ముఖ్యమైన పనులను కూడా మరచిపోవడం ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితిని డిమెన్షియా అంటారు. ఇది ఎందుకు వస్తుందో తెలుసుకుందాం.

సాధారణంగా మెదడు దెబ్బతినడం వల్ల డిమెన్షియా వస్తుంది. మెదడు అనేక భాగాలను కలిగి ఉంటుంది. వీటిలో ఒకటి సెరిబ్రల్ కార్టెక్స్. కొన్ని కారణాల వల్ల ఈ భాగంలో ఏదైనా ఆటంకం ఏర్పడితే ఆ వ్యక్తికి ఏకాగ్రత, ఆలోచించడం, ఏదైనా నిర్ణయం తీసుకోవడం, ఏదైనా పనిని గుర్తుంచుకోవడం వంటి సమస్యలు మొదలవుతాయి. ఈ విషయాలు వ్యక్తి దైనందిన జీవితంపై ప్రభావం చూపడం ప్రారంభిస్తాయి. వయసు పెరిగే కొద్దీ ఈ సమస్యలు పెరుగుతాయి.

ఒక వ్యక్తి ప్రమాద సమయంలో తలకు గాయం అయితే లేదా అతని తలలో కణితి ఉంటే, అప్పుడు ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ వ్యాధిలో మెదడు కణాలు పనిచేయలేవు. దీనికి ఇంకా నివారణ లేదు. అయినప్పటికీ కొన్ని చికిత్సలు, మందుల ద్వారా దీని లక్షణాలను తగ్గించవచ్చు. గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 47.5 మిలియన్ల మంది చిత్తవైకల్యం రోగులు ఉన్నారు. ఈ వ్యాధి లక్షణాలు పెరిగే కొద్దీ రోగి పూర్తిగా వేరొకరిపై ఆధారపడతాడు. చాలా సందర్భాలలో జ్ఞాపకశక్తి పూర్తిగా నశిస్తుంది.

డిమెన్సియా లక్షణాలు: ముఖ్యమైన విషయాలను మర్చిపోవడం, చిన్న చిన్న సమస్యలను పరిష్కరించలేకపోవడం, ఏకాగ్రతతో ఇబ్బంది పడటం, సంఖ్యలను లెక్కించడంలో లేదా కలపడంలో, తీసివేయడంలో సమస్య ఉండటం, ఎక్కడికైనా వెళ్లేటప్పుడు దారి మరిచిపోవడం, ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు రావడం, ముఖ్యమైన పనిని మరిచిపోవడం, చాలా శ్రమ తర్వాత కూడా ఒక పనిని గుర్తుంచుకోలేకపోవడం లాంటివి జరుగుతాయ. 

Tags:    

Similar News