Single Kidney: ఒకే కిడ్నీతో జన్మించిన పిల్లలు ఆరోగ్యంగా ఉండగలరా? తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయాలివే
Single Kidney : సాధారణంగా మనిషికి రెండు కిడ్నీలు ఉంటాయి. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి వెయ్యి మంది పిల్లల్లో ఒకరు ఒకే ఒక్క కిడ్నీతో జన్మిస్తున్నారు.
Single Kidney : ఒకే కిడ్నీతో జన్మించిన పిల్లలు ఆరోగ్యంగా ఉండగలరా? తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయాలివే
Single Kidney: సాధారణంగా మనిషికి రెండు కిడ్నీలు ఉంటాయి. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి వెయ్యి మంది పిల్లల్లో ఒకరు ఒకే ఒక్క కిడ్నీతో జన్మిస్తున్నారు. తమ బిడ్డ ఒక్క కిడ్నీతో పుట్టినప్పుడు తల్లిదండ్రులు సహజంగానే ఆందోళన చెందుతారు. అయితే వైద్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. భయపడాల్సిన అవసరం లేదు. కేవలం ఒక కిడ్నీతో జన్మించిన పిల్లలు కూడా సాధారణ, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చని వైద్యులు భరోసా ఇస్తున్నారు. అయితే, అందుకు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయించాల్సిన పరీక్షలు ఏమిటి? పిల్లల ఎదుగుదలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? అనే విషయాలను ఇప్పుడు వివరంగా చూద్దాం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం, ప్రతి 1000 మంది పిల్లల్లో ఒకరు కేవలం ఒక మూత్రపిండంతో జన్మిస్తున్నారు. అయితే, ఇది ఆందోళన చెందాల్సిన పరిస్థితి కాదని వైద్య నిపుణులు అంటున్నారు. వైద్యులు చెబుతున్న ప్రకారం ఒకే కిడ్నీతో జన్మించిన పిల్లలు కూడా సాధారణ జీవితాన్ని గడపవచ్చు. అయితే, ఆరోగ్యకరమైన జీవితం కోసం కొన్ని నియమిత తనిఖీలు, జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. సరైన ఆహారం, జీవనశైలిపై దృష్టి పెడితే ఎలాంటి ప్రమాదం ఉండదని డాక్టర్లు భరోసా ఇస్తున్నారు.
గర్భధారణ సమయంలోనే అల్ట్రాసౌండ్ వంటి లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులో ఉండటం వల్ల, పుట్టకముందే ఈ పరిస్థితిని గుర్తించి, వైద్యులను సంప్రదించి సరైన చికిత్సను ముందస్తుగా మొదలుపెట్టవచ్చు. ఒకే కిడ్నీ ఉన్న పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు తల్లిదండ్రులు కొన్ని తప్పనిసరి పరీక్షలు మరియు జాగ్రత్తలు పాటించాలి. ఈ పిల్లలకు ప్రతి సంవత్సరం మూత్రంలో ప్రొటీన్, రక్తపోటు పరీక్షలు చేయించడం చాలా ముఖ్యం. ఈ పరీక్షలు కిడ్నీపై ఒత్తిడి లేదా నష్టం జరగబోయే సంకేతాలను ముందుగానే గుర్తించడంలో సహాయపడతాయి.
అయితే, కేవలం ఒక కిడ్నీ ఉన్నంత మాత్రాన పిల్లలు ఎప్పుడూ ఆంక్షలు పెట్టుకుని, జాగ్రత్తగా బతకాలని అర్థం కాదు. వారు ఇతర పిల్లల మాదిరిగానే అన్ని కార్యకలాపాలలో పాల్గొనవచ్చు. ఆడుకోవచ్చు. సాధారణంగా ఒకే మూత్రపిండం ఉన్న పిల్లలకు ప్రత్యేక ఆహారం అవసరం లేదు. కానీ కిడ్నీకి హాని కలిగించే పదార్థాలను మాత్రం తప్పనిసరిగా నివారించాలి.
ఒక కిడ్నీతో జన్మించినంత మాత్రాన పిల్లల పెరుగుదల లేదా శారీరక సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని భయపడాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాలలో, ఒకే మూత్రపిండం ఉండటం వల్ల పిల్లల శారీరక ఎదుగుదలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడదు. కేవలం ఒక కిడ్నీ ఉన్నందున, ఆ పిల్లలు శారీరకంగా బలహీనంగా ఉంటారని అనుకోవడం సరికాదు. కొన్నిసార్లు మాత్రమే, ఒకే మూత్రపిండం ఉండటం అనేది ఇతర ఆరోగ్య సమస్యలతో కూడిన పెద్ద సిండ్రోమ్‌లో భాగమై ఉండవచ్చు. కానీ ఎక్కువ శాతం సందర్భాలలో ఇది సాధారణ విషయమే.