Metabolism: మెటబాలిజం పెరిగేందుకు ఇలా చేస్తే చాలు!
కొందరు ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. మరికొందరు కొద్దిగా తిన్నా బరువు పెరిగిపోతుంటారు. ఈ తేడా ఎందుకు ఉంటుంది?
Metabolism: మెటబాలిజం పెరిగేందుకు ఇలా చేస్తే చాలు!
కొందరు ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. మరికొందరు కొద్దిగా తిన్నా బరువు పెరిగిపోతుంటారు. ఈ తేడా ఎందుకు ఉంటుంది? అందరి బాడీ రియాక్షన్స్ ఒకేలా ఎందుకు ఉండవు? ఎందుకంటే.. దానికి మెటబాలిజమే కారణం. ఇదెలా ఉంటుందంటే..
శరీరం శక్తిని ఖర్చు చేసే వేగాన్ని మెటబాలిజం అంటారు. ఈ వేగం మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి మీద ఆధారపడి ఉంటుంది. మెటబాలిజం ఎక్కువగా ఉంటే శరీరం హెల్దీగా, చురుగ్గా ఉంటుంది. శరీరంలో కొవ్వు పేరుకునే అవకాశాలు తగ్గుతాయి. అయితే ఈ మెటబాలిజాన్ని పెంచేదెలా?
మెటబాలిజం ప్రక్రియను మార్చాలంటే లైఫ్‌స్టై్ల్ డిసిప్లేన్‌గా ఉండాలి. రోజువారీ పనులన్నీ ఒక క్రమపద్ధతిలో జరగాలి. రోజూ ఒకే టైంకి తినడం, నిద్ర పోవడం చేయాలి. అలాగే రోజూ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. ఇలా డిసిప్లేన్‌గా ఉండడం వల్ల శరీరం ట్యూన్ అవుతుంది. రోజూ ఏ టైంకి ఏం జరుగుతుందో శరీరానికి అర్థం అవుతుంది. అప్పుడు శరీరానికి అదనంగా ఫ్యాట్ స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.
ఇలా చేస్తే చాలు
మెటబాలిజం పెరగడం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రన్నింగ్, సైక్లింగ్, జాగింగ్ వంటివి కూడా చేయొచ్చు. అలాగే ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం. నిద్ర తగ్గితే, శరీరంలోని బ్లడ్ షుగర్ కంట్రోల్ అవ్వదు. దానివల్ల ఒత్తిడి పెరిగి మెటబాలిజం తగ్గుతుంది.
రోజుకి కనీసం నాలుగు లీటర్ల నీరు తాగాలి. ఇది జీవక్రియల వేగాన్ని పెంచి శరీరం నుంచి వ్యర్థాలు, అధిక కొవ్వును తొలగించడానికి తోడ్పడుతుంది. ఒకేసారి ఎక్కువ భోజనం తినకుండా తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తినడం అలవాటు చేసుకోవాలి.
ముఖ్యంగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అస్సలు మానేయకూడదు. వేళకు ఎంతో కొంత ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఆహారం తినకపోతే జీవక్రియల వేగం తగ్గుతుంది.
రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. అలాగే ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. ఇవి రక్తంలోని ఇన్సులిన్‌ను నియంత్రించి మెటబాలిజంను పెంచుతాయి.
జంక్ ఫుడ్ వల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరిగి మెటబాలిజం రేటు తగ్గుతుంది. కాబట్టి తేలికగా అరిగే ఆహారాన్నే తీసుకోవాలి. ‘బి’ విటమిన్లు ఉన్న ఆహారాలు, అరటి పండ్లు, ఆలుగడ్డలు, కోడిగుడ్లు, ఆరెంజ్, పీనట్ బటర్, పల్లీలు, పచ్చి బఠానీలు, పాలకూర, మిల్లెట్స్ వంటివి తీసుకుంటే మెటబాలిజం పెరుగుతుంది.