బీట్‌రూట్.. చాలమంది దీన్ని కూరగా చేసుకుని తింటారు. అయితే బీట్‌రూట్ జ్యూస్ తీసుకుని ఒక గ్లాస్ మోతాదులో తాగితే ఆరోగ్యానికి చాల మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. బీట్‌రూట్ వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు నిపుణులు.
రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్‌ను తాగితే దాంతో శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు కరుగుతుంది. దీంతో బరువు తగ్గుతారు. ఎప్పుడూ బద్దకంగా ఉండే వారు బీట్‌రూట్ జ్యూస్ తాగితే యాక్టివ్ అవుతారు. గర్భిణీలు రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే ఎంతో మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బీట్ రూట్ లో వారికి కావల్సిన ఫోలిక్ యాసిడ్ అందుతుంది. తద్వారా అది కడుపులోని బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది. శిశువు సక్రమంగా ఎదుగుతుంది. ఎదిగే పిల్లలకు రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్‌ను తాగిస్తే చాల మంచిదంటున్నారు నిపుణులు. బీట్ రూట్‌లో ఉండే విటమిన్ ఎ, సి, కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, ఐరన్ పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతాయి అంటున్నారు నిపుణులు.
బీట్ రూట్ జ్యూస్‌ను రోజూ తాగితే గుండె సమస్యలు నుంచి ఉపసమనం పొందవచ్చు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా హై బీపీ తగ్గుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు రోజూ బీట్‌రూట్ జ్యూస్ సేవిస్తే ఆ సమస్య పోతుంది అంటున్నారు నిపుణులు.
రోజూ ఆకుకూరలూ, బీట్‌రూట్ వంటి వాటిని రోజు వారీ అహారంలో చేరిస్తే దృష్టిలోపం కలిగించే, మాక్యులర్ డీజనరేషన్ అనే వ్యాధిరాకుండా జాగ్రత్తపడవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కంటి ఆరోగ్యానికి అవసరమైన ప్రధాన పోషకం నత్రజని. 100 గ్రాముల పాలకూరలో 20 మి. గ్రాముల నత్రజని ఉంటుంది. అదే బీట్‌రూట్‌లో అయితే ప్రతి వంద గ్రాములో 15 గ్రాముల నత్రజని ఉంటుంది. అందువల్ల రోజు మొత్తంలో ఈ రెండింటిలో ఏదో ఒకటి 100 గ్రాముల మోతాదులో ఆహరంతో తీసుకుంటే కంటి సమస్యలు చాలా వరకు తొలగిపోవడమే కాకుండా, అసలు రాకుండానే పోతాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.