వంట చేస్తుంటే చేయి కాలిందా..?

Update: 2019-07-30 15:52 GMT

మహిళలు ఎక్కువ సమయం వంటింట్లోనే గడుపుతుంటారు. వంటలు చేస్తూ చేతులు, వేళ్లు కాల్చుకునే వారు ఉన్నారు. అయితే అలా కాలిన వెంటనే ఓ చిన్న చిట్కా పాటిస్తే మంచి ఉపశమనం కల్గుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాలిన చోట చాలమంది వాటర్ పోసుకుని ఉపశమనం పొందుతారు. అయితే అలాకాకుండా మంట చిటికెలో మాయం అవటానికి అలోవేరా చిట్కాను పాటిస్తే మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.

అలోవేరా గుజ్జును కాలిన ప్రదేశంలో రాయాలి. అలోవేరా గుజ్జు చర్మం మీద పొరలా పరుచుకుంటుంది. దాంతో నరాల చివర్లు గాలికి ఎక్స్‌పోజ్‌ అవకపోవటంతో మంట అదుపులోకొస్తుంది. దీనివల్ల నొప్పి చిటికెలో మాయమవటంతోపాటు గాయం కూడా త్వరగా మానుతుంది. పైగా కలబంద గుజ్జు వల్ల గాయం త్వరగా మానటంతోపాటు, ఆ ప్రదేశంలో మచ్చ ఏర్పడకుండా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Tags:    

Similar News