Relationship News: పెళ్లికి ముందు తల్లి కూతురుకు ఈ 5 విషయాలు చెప్పాలి.. అవేంటంటే..?

Relationship News: పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం కాదు రెండు కుటుంబాల మధ్య సంబంధం.

Update: 2024-03-14 14:30 GMT

Relationship News: పెళ్లికి ముందు తల్లి కూతురుకు ఈ 5 విషయాలు చెప్పాలి.. అవేంటంటే..?

Relationship News: పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం కాదు రెండు కుటుంబాల మధ్య సంబంధం. అందుకే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ సంబంధం చూసేటప్పుడు అటు ఏడుతరాలు ఇటు ఏడుతరాలు చూసి పెళ్లి చేయాలని చెబుతారు. ఆడపిల్ల పుట్టగానే తల్లిదండ్రులు ఆమె పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు కూతురుకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తే తమ పని అయిపోయిందన్నట్లుగా ఫీలవుతుంటారు. కానీ అంతకు ముందు కూతురును కొత్త జీవితానికి సిద్దం చేయాలి. ఇందులో తల్లి కీలక పాత్ర పోషించాల్సిఉంటుంది. ఎందుకంటే అత్తవారింట్లో పరిస్థితులు ఎలా ఉంటాయో ఒక మహిళ మాత్రమే మరో మహిళకు చెప్పగలదు. ఈ రోజు పెళ్లికి ముందు ఒక తల్లి తన కూతురుకు ఎలాంటి విషయాలపై అవగాహన కల్పించాలో తెలుసుకుందాం.

ఇల్లు నడిపించే బాధ్యత

ప్రతి తల్లి తన కూతురుకు ఇంటిని నడిపించే పద్దతి, బాధ్యతల గురించి వివరించాలి. కుటుంబ సభ్యులందరితో కలివిడిగా ఉండాలని, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ సభ్యుల ఆనందాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలని చెప్పాలి.

ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకోకూడదు

ఒక కుటుంబంలో చాలా రకాల వ్యక్తులు ఉంటారు. కొందరు మీకు సపోర్ట్‌ చేసేవారైతే మరికొందరు మీకు వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయాన్ని పెళ్లికి ముందు తల్లి కూతురుకి చెప్పాలి. అత్తవారింట్లో ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకొని ఎవరినీ శత్రువుగా భావించకూడదని అవగాహన కల్పించాలి.

కాలంతో పాటు మార్పు

ప్రతి అమ్మాయికి పెళ్లయిన తొలినాళ్లు కష్టతరంగా ఉంటుంది. ఈ సమయంలోనే చాలా సర్దుబాట్లు చేయాల్సి ఉంటుంది. అందుకోసం ప్రతి తల్లి తన కూతురిని మానసికంగా సిద్ధం చేయాలి. కాలంతో పాటు పరిస్థితులు మారుతాయని వారికి నేర్పించాలి. ఇందుకోసం కాస్త ఓపిక పట్టడం అవసరమని దిశానిర్దేశం చేయాలి.

ఆత్మగౌరవం విషయంలో రాజీ లేదు

అన్ని విషయాల్లో సర్దుబాటు చేసుకోవచ్చు కానీ ఆత్మగౌరవం విషయంలో రాజీపడవద్దని సూచించాలి. తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన ప్రాముఖ్యతను తల్లి తన కూతురికి చెప్పడం అవసరం.

క్షమాపణ చెప్పడం అవసరం

క్షమాపణ చెప్పాలన్నా, క్షమించాలన్నా పెద్ద మనసు కలిగి ఉండాలి. ఇది అత్తవారింటికి వెళ్లే ఒక అమ్మాయికి కచ్చితంగా ఉండాల్సిన లక్షణం.ప్రతి తల్లి తన కుమార్తెకు తప్పులను క్షమించమని, అవసరమైతే క్షమాపణ అడగాలని నేర్పించాలి.

Tags:    

Similar News