Pepper Mint Oil: చలికాలంలో మిరియాల నూనెతో ఈ వ్యాధులకు చెక్..?

Pepper Mint Oil: చలికాలంలో మిరియాల నూనెతో ఈ వ్యాధులకు చెక్..?

Update: 2022-02-04 13:30 GMT

Pepper Mint Oil: చలికాలంలో మిరియాల నూనెతో ఈ వ్యాధులకు చెక్..?

Pepper Mint Oil: భారతదేశం సుగంధద్రవ్యాలకు పుట్టినిల్లు. ప్రతి ఒక్కరి వంటగదిలో ఇవి కనిపిస్తాయి. ఇవి ఆహారానికి రుచిని పెంచడమే కాకుండా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. చాలా వ్యాధులను నయం చేసే గుణాలను కలిగి ఉంటాయి. సనాతన ఆయుర్వేదంలో ప్రాచీన కాలం నుంచి సుగంధ ద్రవ్యాలను వాడుతున్నారు. అందులో ముఖ్యమైనది నల్ల మిరియాలు. ఇంగ్లీష్‌లో బ్లాక్‌ పెప్పర్ అంటారు. ఇది వంటకాలకు రుచిని అందించడమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కరోనా కాలంలో వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. అలాగే నల్ల మిరియాల నూనె చలికాలంలో వచ్చే వ్యాధులకు చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు.

నల్ల మిరియాల నూనె తిమ్మిరి, కండరాల నొప్పులు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది తిమ్మిరిని తగ్గిస్తుంది స్నాయువును మెరుగుపరుస్తుంది. ఇది ఆర్థరైటిస్ లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ప్రధానంగా అరోమాథెరపీకి ఉపయోగిస్తారు. ఇది ఒత్తిడి, ఆందోళనను కూడా తగ్గిస్తుంది. ఈ ఆయిల్ నరాలను శాంతపరుస్తుంది. కండరాలను సడలించడం ద్వారా మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

నల్ల మిరియాల నూనె జీర్ణ సమస్యలతో బాధపడేవారికి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది నోటిలోని లాలాజల గ్రంధుల నుంచి పెద్ద ప్రేగు వరకు ఉత్తేజపరుస్తుంది. అజీర్ణం, వికారం, విరేచనాలు, మలబద్ధకం, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. నల్ల మిరియాల నూనె యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉంటుంది. ధూమపానం మానేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ మానుకోలేని వారికి ఈ నూనె చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ నూనె సిగరెట్ తాగాలనే కోరికని చంపేస్తుంది.

Tags:    

Similar News