మౌత్ వాష్ వాడుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..!

Mouthwash Side Effects: ఈ రోజుల్లో నోటి దుర్వాసన నుంచి బయటపడటానికి చాలామంది మౌత్‌ వాష్‌ని వాడుతున్నారు.

Update: 2022-11-07 08:52 GMT

మౌత్ వాష్ వాడుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..!

Mouthwash Side Effects: ఈ రోజుల్లో నోటి దుర్వాసన నుంచి బయటపడటానికి చాలామంది మౌత్‌ వాష్‌ని వాడుతున్నారు. కానీ దీనివల్ల చాలా దుష్పరిణామాలు ఉన్నాయి. మౌత్‌ వాష్‌ అధికంగా ఉపయోగించడం వల్ల నోటికి చాలా హాని జరుగుతుంది. మౌత్ వాష్ అనేది నోటిలో ఉండే బ్యాక్టీరియాను శుభ్రం చేయడానికి ఒక మార్గం. దీని వల్ల వ్యాధులను నివారించవచ్చు. ఈ బాక్టీరియా దుర్వాసన, దంతక్షయాన్ని కలిగిస్తుంది. కాబట్టి మౌత్ వాష్ ఉపయోగించడం చాలా ముఖ్యం. కానీ మౌత్‌ వాష్‌ వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

క్యాన్సర్ ప్రమాదం

మౌత్ వాష్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇందులో క్యాన్సర్‌కు కారణమయ్యే సింథటిక్ పదార్థాలు ఉంటాయి. నోటిని శుభ్రపరిచే మౌత్ వాష్ మెడ, తలపై వచ్చే క్యాన్సర్ అభివృద్ధికి దారితీస్తుంది. మౌత్ వాష్‌లో ఉండే పదార్థాలు బ్యాక్టీరియాను చంపుతాయి. అయితే అదే సమయంలో అవి నోటి చర్మంపై ప్రభావం చూపుతాయి. మౌత్ వాష్ వల్ల నోరు రఫ్ అవుతుంది. అందువల్ల అధిక మౌత్ వాష్‌కు దూరంగా ఉండాలి.

నోటిలో మంట

అనేక మౌత్ వాష్‌ల తయారీలో ఆల్కహాల్ ఉపయోగిస్తారు. దీని కారణంగా నోటిలో తీవ్రమైన మంట సమస్య ఉంటుంది. మౌత్ వాష్‌లో ఉండే గట్టి పదార్థాల వల్ల మంట సమస్య మొదలవుతుంది. దీనివల్ల నోరు కూడా ఎర్రగా మారుతుంది. రోజూ మౌత్ వాష్ వాడటం వల్ల దంతాల సమస్య వస్తుంది. దంతాలలో గుర్తులు ఏర్పడుతాయి. దంతాలు బలహీనంగా, గరుకుగా మారుతాయి. రోజూ మార్కెట్‌లో రసాయనాలతో తయారు చేసిన మౌత్‌వాష్‌ను ఉపయోగించడం వల్ల హాని కలుగుతుంది. ఇది కనీసం రెండు రోజులకు ఒకసారి వాడాలి. మనం ఇంట్లోనే వేప లేదా పుదీనాతో సహజసిద్ధమైన మౌత్‌వాష్‌ను తయారు చేసుకోవచ్చు. దీనిని రోజూ ఉపయోగించవచ్చు. ఎలాంటి ప్రమాదం ఉండదు.

Tags:    

Similar News