జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే కన్నుమూత

జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే (95) కన్నుమూశారు. 95 సంవత్సరాల వయస్సుగల ముగాబే గత కొద్దికాలంగా అనారోగ్యంతో సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కొద్ది సేపటి క్రితం మృతి చెందినట్లు జింబాబ్వే మీడియా ప్రకటించింది.

Update: 2019-09-06 06:40 GMT

జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే (95) కన్నుమూశారు. 95 సంవత్సరాల వయస్సుగల ముగాబే గత కొద్దికాలంగా అనారోగ్యంతో సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కొద్ది సేపటి క్రితం మృతి చెందినట్లు జింబాబ్వే మీడియా ప్రకటించింది. ఆఫ్రికన్ దేశాల విముక్తికై,అక్కడి ప్రజల హక్కులకై పోరాడిన ముగాబే మృతి తీరని లోటు అని ఆయన విచారం వ్యక్తం చేశారు. కాగా, జింబాబ్వేను ఏకఛత్రాధిపత్యంతో 37 ఏళ్లు పాలించిన ముగాబే పాలనకు 2017లో తెరపడింది.ఉద్యమ నాయకుడిగా మొదలైన ఆయన జీవితం నియంతగా ముగిసిపోయింది.  



Tags:    

Similar News