నేటితో ముగిసిన జగన్‌ విజయసంకల్ప యాత్ర

వైఎస్‌ జగన్‌ విజయసంకల్ప యాత్ర ముగిసింది. 3,648 కిలో మీటర్ల పాదయాత్ర ముగించుకుని ఇచ్ఛాపురం చేరుకున్న జగన్‌‌కు జనం ఘనస్వాగతం పలికారు. మూడు అంతస్తుల్లో నిర్మించిన విజయసంకల్ప స్తూపాన్ని ఆవిష్కరించారు.

Update: 2019-01-09 12:23 GMT

వైఎస్‌ జగన్‌ విజయసంకల్ప యాత్ర ముగిసింది. 3,648 కిలో మీటర్ల పాదయాత్ర ముగించుకుని ఇచ్ఛాపురం చేరుకున్న జగన్‌‌కు జనం ఘనస్వాగతం పలికారు. మూడు అంతస్తుల్లో నిర్మించిన విజయసంకల్ప స్తూపాన్ని ఆవిష్కరించారు. ఇచ్ఛాపురంతోపాటు పరిసర ప్రాంతాల్లో జనసందోహం నెలకొంది. 16వ నెంబర్‌ జాతీయరహదారి కిలోమీటర్ల మేర జనం బారులు తీరారు.

బాహుదా నదీ తీరంలో ఏర్పాటైన విజయసంకల్ప స్థూపాన్ని ఇచ్ఛాపురంలో వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. జగన్ రాకముందే వైసీపీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున అక్కడికి తరలివచ్చారు. అనంతరం కాలినడకన పాత బస్టాండ్‌ వద్దకు చేరుకుని అక్కడ భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.

2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించారు. 341 రోజుల పాటు 3,648 కిలో మీటర్లు పాదయాత్ర చేసిన వ్యక్తిగా నిలిచారు. జ‌గ‌న్ త‌న పాద‌యాత్రలో మొత్తం 134 నియోజ‌క వ‌ర్గాలు క‌వ‌ర్ చేశారు. 2,516 గ్రామాలు, 231 మండలాలు, 54 మున్సిపాల్టీలు, 8 కార్పోరేష‌న్ల మీదుగా ఈ యాత్ర సాగించారు. మొత్తం 124 బ‌హిరంగ స‌భ‌ల్లో జ‌గ‌న్ ప్రసంగించారు. 55 ఆత్మీయ స‌మ్మేళ‌నాల్లో పాల్గొన్నారు. అడుగడుగునా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పాదయాత్ర కొనసాగించారు జగన్.

Similar News