వైవీ సుబ్బారెడ్డి దారెటు..?

Update: 2019-03-07 13:47 GMT

ఒకప్పుడు ఆయన వైసీపీలో కీలక నేత. జగన్‌కు కుడిభుజంగా వ్యవహరించే వారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ నేతకు ఎంపీ సీటు లభిస్తుందా లేదా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ కీలక నేతకు జగన్ టికెట్ నిరాకరిస్తుండటానికి కారణం ఏంటి...? వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి నోటిదురుసు అతని ఎంపీ సీటుకే ఎసరు పెట్టనుందా అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. మాజీ మంత్రి , జిల్లా పార్టీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసులు రెడ్డిపై వైవీ ఫైర్ అయ్యారు. ఇటు ప్రకాశం జిల్లాలో సీనియర్ నేత అయిన మాగుంటను కూడా వైవీ ఏకిపారేశారు.

ఈ మాటలే వైవీపై జగన్‌కు కోపం తెప్పించాయి. జగన్ టీంతో మాగుంట కొంతకాలంగా టచ్‌లో ఉన్నాడనే వార్తలు వినవస్తున్నాయి. మాగుంటకు కొన్ని ఇబ్బందుల దృష్ట్యా జగన్ పార్టీలో కి వెళ్లాలని కొందరి సలహాతో చర్చలు ఆలోచనలు జరుపుతున్న వేళ వైవీ మాటలు తూటాలు పేల్చే సరికి వైవీ సీటుకే అసలుకే ఎసరు వచ్చేసింది. ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ అభ్యర్థిగా మాగుంటను జగన్ ప్రకటిస్తే ఇప్పడు మరి వైవీ వాట్ నెక్ట్స్ అని అందరూ ప్రశ్న వేస్తున్నారు. తనకు రాజ్యసభకు వెళ్లే అలోచన లేదని మొన్ననే వైవీ బహిరంగంగా ప్రకటించేశారు. పార్టీ ముందు ఎన్నికలు సజావుగా అయిపోయి పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యసభ ఆఫర్ చేస్తే తనకు వద్దని ముందుగానే వైవీ ప్రకటించేశారు. అయితే వైవీ అడుగులు ఎటువైపు వేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. 

Similar News