వైసీపీలో మహిళా అభ్యర్థులు ఎంతమందో తెలుసా..?

Update: 2019-03-17 06:46 GMT

శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వైసీపీ విడుదల చేసింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఒకేసారి ప్రకటించారు. విలేకరుల సమావేశంలో పార్టీ తరఫున శాసనసభ, లోక్‌సభ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల జాబితాలను విడుదల చేశారు. ఈ జాబితాను విడుదల చేశారు. కాగా 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను, 25మంది లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. వైసీపీ విడుదల చేసిన జాబితాలో లోక్‌సభ అభ్యర్థులుగా నలుగురు మహిళలకు చోటు కల్పించారు. మరియు అసెంబ్లీ అభ్యర్థులుగా 11 మంది మహిళలకు చోటు కల్పించారు.

వైసీపీ మహిళా లోక్‌సభ అభ్యర్థులు

అమలాపురం-చింతా అనురాధ, అనకాపల్లి-కండ్రేగుల వెంకట సత్యవతి, కాకినాడ-వంగా గీత, అరకు- గొడ్డేటి మాధవి

వైసీపీ మహిళా అసెంబ్లీ అభ్యర్థులు

విడదల రజిని-చిలకలూరిపేట-గుంటూరు,భాగ్యలక్ష్మి-పాడేరు(ఎస్టీ)-విశాఖపట్నం, రోజా సెల్వమణి-నగరి-చిత్తూరు, పాముల పుష్ప శ్రీవాణి-కురుపం(ఎస్టీ)-విజయనగరం, ఉషా శ్రీ చరణ్-కల్యాణదుర్గం-అనంతపురం, జొన్నలగడ్డ పద్మావతి-సింగనమల(ఎస్సీ)-అనంతపురం, సుచరిత మేకతోటి-ప్రత్తిపాడు(ఎస్సీ)-గుంటూరు, ఉండవల్లి శ్రీదేవి-తాడికొండ(ఎస్సీ)-గుంటూరు, కె శ్రీదేవి-పత్తికొండ-కర్నూలు, వనితా తానేటి-కొవ్వూరు(ఎస్సీ)-పశ్చిమ గోదావరి, తోట వాణి-పెద్దాపురం-తూర్పు గోదావరి,

Similar News