తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కేదెప్పుడు?

దసరా వస్తే.. దశ మారుతుందంటారు. కానీ.. తెలుగు రాష్ట్రాల ఆర్టీసీల దశ మాత్రం మారడం లేదు. అంతరాష్ట్ర బస్సు రవాణాకు తాము రెడీగా ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఒప్పుకోవడం లేదంటున్నారు ఏపీ అధికారులు.

Update: 2020-10-23 12:20 GMT

దసరా వస్తే.. దశ మారుతుందంటారు. కానీ.. తెలుగు రాష్ట్రాల ఆర్టీసీల దశ మాత్రం మారడం లేదు. అంతరాష్ట్ర బస్సు రవాణాకు తాము రెడీగా ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఒప్పుకోవడం లేదంటున్నారు ఏపీ అధికారులు. కనీసం దసరా పండుగను పురస్కరించుకునైనా ప్రయాణికులకు ఇబ్బంది కల్గకుండా బస్సు రవాణా చేపడదామంటున్నారు.

తెలుగురాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కి నెలలవుతోంది.. కానీ రెండు రాష్ట్రాల మథ్య ఆర్టీసీ రాకపోకలు మాత్రం ప్రారంభం కాలేదు. కిలోమీటర్ల అంశంలో రెండు రాష్ట్రాల మద్యా ఏర్పడ్డ ఇబ్బంది తొలగకపోవడంతో ఇరు రాష్ట్రాల ఆపరేటింగ్ ఈడీల మీటింగ్ ఫలితం ఇవ్వడం లేదు. రెండు రాష్ట్రాలు ఒకే దూరం తిప్పితేనే వర్కౌట్ అవుతోందని తెలంగాణ చెబుతోంది. ఇలాంటి తరుణంలో ఆర్టీసీ బస్సులు తిప్పేందుకు సిద్ధంగా ఉన్నామని రెండు రాష్ట్రాల అధికారులు చెబుతున్నారు. ఐతే ఈడీల మధ్య ఒప్పందం కుదిరితే, పగటి పూట కూడా ఏపీ-తెలంగాణల మధ్య రవాణా జరుగుతుంది.‌ అదే జరిగితే, ప్రజల ఇబ్బందులు తొలగుతాయి.

ఇప్పటికే పండుగ ప్రయాణాలు ప్రారంభమవ్వడం.. ఆర్టీసీ బస్సులు తిరగక తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నామంటున్నారు ప్రయాణికులు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు సిద్ధంగా ఉన్నామని ప్రకటించినప్పటికీ ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఇప్పటికైనా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పంధించి అంతర్రాష్ట్ర సర్వీసులను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News