ఉమ్మ‌డి హైకోర్టుకు చివ‌రి రోజు..లాయర్లు,సిబ్బంది హడావుడి!

దేశ న్యాయచరిత్రలో ఎన్నో చారిత్రాత్మక తీర్పులిచ్చిన ఉమ్మడి హైకోర్టు నేటితో రెండుగా విడిపోనుంది. రాష్ట్రపతి గెజిట్‌తో రేపటి నుంచి ఏపీ, తెలంగాణలకు వేర్వేరు హైకోర్టులు ఏర్పడునున్నాయి.

Update: 2018-12-31 08:13 GMT
High Court

దేశ న్యాయచరిత్రలో ఎన్నో చారిత్రాత్మక తీర్పులిచ్చిన ఉమ్మడి హైకోర్టు నేటితో రెండుగా విడిపోనుంది. రాష్ట్రపతి గెజిట్‌తో రేపటి నుంచి ఏపీ, తెలంగాణలకు వేర్వేరు హైకోర్టులు ఏర్పడునున్నాయి. ప్రస్తుతమున్న హైకోర్టు తెలంగాణకు చెందగా అమరావతి కేంద్రంగా రేపటి నుంచి కొత్త హైకోర్టు ప్రారంభం కానుంది. ఈ నేపధ్యంలో ఉమ్మడి హైకోర్టులోని ఏపీకి సంబంధించిన పత్రాలు, ఫైళ్లు, ఇతర సామాగ్రిని తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. చివరి రోజు కోర్టు కార్యకలాపాలు ముగిసిన వెంటనే కోర్టు సిబ్బందితో పాటు ఇతర సామాగ్రి అమరావతి తరలివెళ్లనున్నాయి. 1956లో ఏర్పడిన ఏపీ హైకోర్టుకు 37 మంది ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరించారు. తొలి న్యాయమూర్తిగా కోక సుబ్బారావు విధులు నిర్వహించగా చివరి న్యాయమూర్తిగా టీబీ రాధాకృళష్ణన్ వ్యవహరించారు.  

Similar News