దానిపై బహిరంగంగా స్పందించాల్సిన అవసరం లేదు: కేశినేని

Update: 2019-06-05 07:27 GMT

ఎంపీ కేశినేని నాని వ్యవహారాన్ని టీడీపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. పార్టీ వైఖరిపై అసంతృప్తితో ఉన్న నానిని బుజ్జగించేందుకు గల్లా జయదేవ్‌ రంగంలోకి దిగారు. అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాలతో కేశినేని నానితో గల్లా జయదేవ్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్పందించిన నాని.. సోషల్‌ మీడియాలో వ్యక్తిగత అభిప్రాయాలే తాను పంచుకున్నానని ఆ స్వతంత్య్రం తనకుందన్న నాని.. దానిపై బహిరంగంగా స్పందించాల్సిన అవసరం లేదన్నారు. లోక్ సభలో టీడీపీపక్షనేత గా వుండడానికి విజయవాడ ఎంపీ కేశినేని నాని విముఖత వ్యక్తం చేస్తూ తన కంటే సమర్థవంతమైన వ్యక్తిని ఈ పదవిలో నియమించాలని పార్టీ అధినేత చంద్రబాబును కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేశినేని నాని బీజేపీ తీర్థంపుచ్చుకుంటురన్నా వార్తలకు స్పందించారు. బీజేపీలో చేరుతున్నానన్న వార్తలు అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. తనకు ఆ అవసరం లేదని చెప్పారు.

Tags:    

Similar News