ఆ గుడిలో ప్రసాదంగా మటన్ బిర్యానీ..

సాధరణంగా ఏ గుడిలోనైనా ప్రసాదంగాగా ఏం పెడతారు? పులిహోరా, లడ్టూలు లేక పోతే కూరగాయాల భోజనాలు అంతే కదా. కాని ఇప్పుడు మీరు చదవబోయే వార్త వింటే ఆశ్చర్యపోవాల్సిందే ఎందుకంటే ఆ గుడిలో ప్రసాదంగా మటన్ బిర్యాని పెడతారు కాబట్టి.

Update: 2019-01-20 07:43 GMT

సాధరణంగా ఏ గుడిలోనైనా ప్రసాదంగాగా ఏం పెడతారు? పులిహోరా, లడ్టూలు లేక పోతే కూరగాయాల భోజనాలు అంతే కదా. కాని ఇప్పుడు మీరు చదవబోయే వార్త వింటే ఆశ్చర్యపోవాల్సిందే ఎందుకంటే ఆ గుడిలో ప్రసాదంగా మటన్ బిర్యాని పెడతారు కాబట్టి. నమ్మడం లేదా ఇది మేము చెబుతున్న ముచ్చట కాదు ఏకంగా ఆ ఆలయ నిర్వాహక కమిటీ సభ్యుడు స్ఫష్టం చేశారు. ఇక వివరాల్లోకి వెళితే తమిళనాడులోకి మదురై జిల్లా తిరుమంగళం సమీపం వడుకంపట్టి గ్రామంలోని మునీశ్వరుడి ఆలయంలో భక్తులకు ఏటా జనవరి 25న జరిగే ఉత్సవాల్లో భక్తులకు వేడి వేడి మటన్ బిర్యానీ ప్రసాదంగా ఇస్తున్నారు. గత ఏడాది 2వేల కేజీల బాస్మతి బియ్యం, 200 మేకల మాంసంతో తయారు చేసి ప్రసాదంగా అందిస్తారు. కాగా ఈ ఏడాది కూడా ప్రతిఏటా తరహాలోనే మటన్ బిర్యానీ ప్రసాదంగా పంపిణీ చేయనున్నారు. అయితే అసలు సాంప్రదాయం ఎందుకు వచ్చిదంటే 85 ఏండ్ల కిందట ఎస్పీఎస్ సుబ్బానాయుడు మునియాండీ(మునీశ్వరుడు) అనే పేరుతో ప్రారంభించిన హోటల్‌కు లాభాలు తెగా లాభాలు రావడంతో ఆ స్వామికి రెండేళ్ల పాటు మటన్ బిర్యానీ నైవేద్యం సమర్పించి భక్తులకు బిర్యానీ పంపిణీ చేశాడు. ఇక అప్పటి నుండి నుండి ఆ ఊరిగ్రామస్తులంతా కలిసి మటన్ బిర్యానీ చేసి భక్తులకు పంపిణీ చేయడం మొదటపెట్టారు.

Similar News