ఆ పేరు వింటేనే చంద్రబాబుకు వణుకు

చంద్రబాబుకు బంధాలు , బంధుత్వాల విలువ తెలియదని తలసాని అన్నారు. చంద్రబాబు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తారన్న తలసాని. చంద్రబాబు రాజకీయాలు చూసి ఉసరవెల్లులు కూడా సిగ్గు పడతాయన్నారు.

Update: 2019-01-17 11:37 GMT

చంద్రబాబుకు బంధాలు , బంధుత్వాల విలువ తెలియదని తలసాని అన్నారు. చంద్రబాబు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తారన్న తలసాని. చంద్రబాబు రాజకీయాలు చూసి ఉసరవెల్లులు కూడా సిగ్గు పడతాయన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీని అదే పార్టీతో పొత్తు పెట్టకునేలా చేసి నట్టేట ముంచేశారని విమర్శించారు. ఏపీ ప్రజలు, ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబును 3 నెలల్లో ఇంటికి పంపుతారని తలసాని జోస్యం చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటు ప్రయత్నాలను టీడీపీ నేతలు విమర్శించడాన్ని తలసాని తప్పు పట్టారు. ఫెడరల్ ఫ్రంట్ పేరెత్తితేనే చంద్రబాబు భయపడుతున్నారని తలసాని అన్నారు. దేశ రాజకీయాల్లో మార్పు తేవడానికి కేసీఆర్ ప్రయత్నిస్తుంటే రాజకీయ పబ్బం గడుపుకునే టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు.

Similar News