నేడు సుప్రీం ముందుకు హైకోర్టు విభజన వివాదం..

హైకోర్టు విభజనను ఆపాలంటూ దాఖలైన పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టు ముందుకు రాబోతోంది. అమరావతిలో కోర్టు భవనం పూర్తయ్యే వరకు తరలింపును నిలిపి వేయాలంటూ ఏపీ న్యాయవాదులు దాఖలు చేసిన పిటిఫన్ను అత్యున్నత న్యాయస్థానం ఇవాళ ఉదయం విచారించబోతోంది. హైకోర్టు విభజన వాయిదా విషయంలో సుప్రీంకోర్టు తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Update: 2018-12-31 04:03 GMT
High Court

హైకోర్టు విభజనను ఆపాలంటూ దాఖలైన పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టు ముందుకు రాబోతోంది. అమరావతిలో కోర్టు భవనం పూర్తయ్యే వరకు తరలింపును నిలిపి వేయాలంటూ ఏపీ న్యాయవాదులు దాఖలు చేసిన పిటిఫన్ను అత్యున్నత న్యాయస్థానం ఇవాళ ఉదయం విచారించబోతోంది. హైకోర్టు విభజన వాయిదా విషయంలో సుప్రీంకోర్టు తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

అమరావతిలో భవన నిర్మాణం పూర్తయ్యే వరకూ హైదరాబాద్‌ నుంచి హైకోర్టు తరలింపును వాయిదా వేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయవాదుల సంఘం శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టుకు సెలవులు కావడంతో వెకేషన్‌ అధికారి దగ్గర పిటిషన్‌ దాఖలు చేసింది. హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ కింద వెంటనే విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్ను సుప్రీం కోర్టు ధర్మాసనం ఇవాళ విచారించబోతోంది.

జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అమరావతి నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలంటూ ఇటీవల రాష్ట్రపతి ఉత్తర్వులిచ్చారు. అయితే అమరావతిలో కోర్టు కాంప్లెక్స్ భవన నిర్మాణం పూర్తికాలేదనీ హడావిడిగా విభజన చేశారంటూ ఉమ్మడి హైకోర్టులో పనిచేస్తున్న ఏపీ న్యాయవాదులు ఆందోళనలకు దిగారు. విభజనను కొంతకాలం పాటు వాయిదా వేయాలంటూ నాయ పోరాటానికి దిగారు. సుప్రీంకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అమరావతిలో హైకోర్టు భవనం పూర్తిగా సిద్ధమయ్యే వరకూ హైదరాబాద్‌లోనే హైకోర్టును యథాతథంగా కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్‌లో కోరారు. అయితే హైకోర్టు విభజనను సుప్రీంకోర్టు వాయిదా వేస్తుందా..? లేదంటే జనవరి 1 ముహూర్తాన్నే కొనసాగిస్తుందా అనే ఆసక్తి నెలకొంది.

మరోవైపు ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తుల విభజన ప్రక్రియ ముగిసింది. దాదాపు 100 మందికి పైగా జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏ రాష్ట్రానికి చెందిన న్యాయమూర్తులను ఆ రాష్ట్రానికే బదిలీ చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో న్యాయమూర్తులు, అదనపు న్యాయమూర్తుల విభజన ప్రక్రియ సంపూర్ణమయింది.

Similar News