చిరు కొరటాల కాంబినేషన్ .. హీరోయిన్ గా శ్రుతి హసన్ ..?

Update: 2019-06-05 05:04 GMT

కాటమరాయుడు సినిమా తర్వాత శృతిహసన్ తెలుగు సినిమాలో కనిపించింది లేదు .. రెండేళ్ల కింద వ‌చ్చిన బెహ‌న్ హోగా తేరీ త‌ర్వాత శృతి పూర్తిగా సినిమాల‌కు దూరంగా ఉంది. అయితే ఇప్పుడు ఆమె తెలుగులో సినిమా చేస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి .. కొరటాల శివ మెగాస్టార్ కాంబినేషన్ లో త్వరలో ఓ సినిమా పట్టాలేక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతిహసన్ నటించనుంది అని తెలుస్తుంది .ఆగస్టులో సెట్స్ పైకి తీసుకురానున్నారని సమాచారం. గతంలో కొరటాల దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా నటించింది శృతి హాసన్. ఈ సినిమా సూపర్ హిట్ అయింది కాబట్టి.. కొరటాలతో రీ ఎంట్రీ ఇవ్వడం పట్ల శృతి కూడా ఆసక్తిగానే ఉందని తెలుస్తోంది. 

Tags:    

Similar News