కాలుష్య కాసారమైన హుస్సెన్ సాగరం

Update: 2019-05-11 07:48 GMT

అది మహానగరానికి మణిహారం భాగ్యనగరానికి ల్యాండ్ మార్క్‌‌. పర్యాటక రంగానికి కేరాఫ్ అడ్రస్. కాని అభివృద్ధి చేయాలనే ఆలోచన అధికారులకు లేదు. పూర్వ వైభవం కల్పిద్దామన్న తపన పాలకులకు లేదు. ఐదేళ్లకోసారి అదిగో సుందర సాగరం అంటూ ఆశ జూపడం అవసరం తీరాక పక్కన పడేయడం రివాజుగా మారింది. ఇక్కడ చూస్తున్నది ఏ ఊరి బయటి చెరువో లేక పోతే ఏ పరిశ్రమ సమీపంలోని వాగు అనుకుంటే పొరబడినట్టే. ఇది మహానగరం నుంచి ప్రపంచస్ధాయి నగరంగా ఎదిగిన హైదరాబాద్‌లోని హుస్సెన్ సాగర్‌‌. ఒకప్పుడు జంట నగరాల్లోని లక్షలాది మందికి తాగు నీరు అందించిన ఈ మహోన్నత సాగరం ఇప్పుడు కాలుష్య కాసారానికి బలై ఇలా మారింది.

హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన కోసం ఇప్పటి వరకు చేసిన ఖర్చులు భారీగానే ఉన్నాయి. 1998 నుంచి ఇప్పటి వరకు వెయ్యి కోట్ల మేర ఖర్చు చేశారు. అయినా ఇప్పటికి రసాయన వ్యర్ధాలు ఇక్కడికి వచ్చి చేరుతున్నాయి. నిర్వహణ పేరుతో కోట్లాది రూపాయల ఖర్చు చేస్తున్నా ఫలితం దక్కడం లేదన్నది నగరవాసుల మాట. సాగర్ పరిసరాలకు వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిన దుస్థితి ఇంకా కొనసాగుతోంది.

తమ దగ్గర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన వనరులు లేకపోవటంతో ప్రైవేట్ వ్యక్తులపై ఆధారపడాల్సి వస్తుందని HMDA చెబుతోంది. పాలకుల వైఫల్యం, అధికారుల అలసత్వంతోనే నగరం నడిబొడ్డున ఉన్న హుస్సెన్ సాగర్ ఇలా కాలుష్య కాసారంగా మారిందనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. అటు పర్యాటకంగా ఇటు తాగు నీటి సరఫరా జరిగే అవకాశాలున్నా ఆ దిశగా అడుగులు వేయడం లేదంటూ ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మిషన్ కాకతీయ తరహాలో హుస్సెన్ సాగర్ ప్రక్షాళనకు నడుం బిగించాలని కోరుతున్నారు. 

Full View

Similar News