అర బకెట్ నీళ్ల కోసం అరగంట పాటు వేచి చూసా .. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

Update: 2019-06-20 06:52 GMT

ప్రస్తుతం తమిళనాడులో నీటి సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పలిన అవసరం లేదు .. నీటి చుక్క కోసం జనాలు అల్లాడి పోతున్నారు . అయితే అక్కడి సమస్యను స్వయంగా తానూ అనుభవించానని ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. తాను స్నానం చేద్దామంటే నీళ్లు లేవని, అర బకెట్ నీళ్ల కోసం అరగంట పాటు వేచి చూడాల్సి వచ్చిందని ఆయన అన్నారు. 'గూర్ఖా' అనే తమిళ చిత్రం ఆడియో ఫంక్షన్ లో పాల్గొన్న ఎస్పీబీ నీటి పొదుపును పాటించాలని చెప్పారు ..బంగారం, ప్లాటినం కన్నా నీరు విలువైనది. నగరంలో నీటి ఎద్దడి బాగా ఉంది. అందుకు మనమే కారణం. నీటిని పొదుపు చేయండి. కంచాలలో తినే బదులు విస్తరాకుల్లో తింటే నీరు ఆదా అవుతుంది. ప్రతిరోజూ బట్టలను మార్చే బదులు, వారంలో రెండు జతలు మాత్రమే ధరిస్తే, ఉతికేందుకు ఖర్చయ్యే నీరు మిగులుతుంది. నీరు ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి" అని ఆయన వ్యాఖ్యానించారు.  

Tags:    

Similar News