ఇంటర్‌లో ఫెయిల్..విద్యార్థుల వరుస ఆత్మహత్యలు

Update: 2019-04-19 12:00 GMT

తెలంగాణలో ఇంటర్ ఫలితాలు పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే మనస్థాపంతో విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. మరోక్కసారి సప్లీ రూపంలో అవకాశం ఉన్నా కానీ ఆలోచించకుండా క్షణీకావేశంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు విద్యార్థులు. నిన్న ఇంటర్ ఫలితాలు విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే కేవలం తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్య ఒత్తిడి వల్లే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నిపుణలు అభిప్రాయపడుతున్నారు.

మేడ్చల్‌లో నవ్యశ్రీ అనే యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య.

మారేడ్‌పల్లిలో ఇంటర్ విద్యార్థిని లాస్య ఆత్మహత్య చేసుకుంది.

ఏఎస్‌రావ్ నగర్‌లో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

హైదరాబాద్‌లో కాగజ్‌నగర్‌కు చెందిన అనామిక సూసైడ్ చేసుకుంది.

వరంగల్‌లో ఇంటర్‌లో ఫెయిల్‌ అయి వరంగల్‌లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న భాను కిరణ్.

ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయినందుకు తీవ్ర మనస్తానంతో బోధన్‌లో ఇంటర్ విద్యార్థిని వెన్నెల ఆత్మహత్య.

 తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలపై ఇటు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదగాల్సిన విద్యార్థుల జీవితాలు ఇలా మధ్యలోనే అసువులు బాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 



Similar News