కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య చిక్కుల్లో పడ్డారు. ఓ సభలో సహనం కోల్పోయిన సిద్ధరామయ్య మహిళపై దురుసుగా ప్రవర్తించారు. మహిళ చేతిలో నుంచి మైక్ లాక్కుని అనుచితంగా ప్రవర్తించారు. సిద్ధరామయ్యకు సంబందించిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. సిద్ధరామయ్య తీరుపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.