ప్రచార సభలో స్టేజ్‌‌పై ఒక్కసారిగా కిందపడ్డ పవన్ కల్యాణ్..

Update: 2019-04-05 12:24 GMT

అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించడం ఒక్కోసారి రాజకీయనేతలకు ఇబ్బందికరంగా మారుతుంది. తాజాగా, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ కు అలాంటి పరిస్థితే ఎదురైంది. పవన్ ప్రసంగిస్తుండగా స్టేజ్ వెనుక భాగం నుంచి వచ్చిన ఓ అభిమాని ఆయన కాళ్లను గట్టిగా పట్టుకున్నాడు. రెండు కాళ్లు పట్టుకోవడంతో పట్టు కోల్పోయిన పవన్ ఒక్కసారిగా కిందపడిపోయారు. కాగా ప్రచార సభ మొదలైన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. పవన్ పట్టుకుని ఉన్న మైక్ కూడా విరిగిపోయింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పవన్‌ను పైకి లేపారు. అనంతరం ఆ అభిమానిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. విజయనగరంలో అయోధ్య మైదానంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ వేదికపైకి పవన్‌ చేరుకున్న కాసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది.

Similar News