బీజేపి, కాంగ్రెస్ ని పట్టించుకోని ఏపి ఓటర్లు ..

Update: 2019-05-25 13:45 GMT

ఏపి ఎన్నికలు ముందు నుండి వైసీపీ మరియు టిడిపి మధ్యనే నడుస్తాయని అందరు అనుకున్నారు . జనసేన పార్టీపైన అంచనాలు ఎవరికీ లేవు . ఇక కాంగ్రెస్ మరియు బీజేపి పార్టీలను ఎవరు పట్టించుకోరు అని అందరు ముందు ఉహించిందే.. అనుకునట్టుగానే అదే జరిగింది .. రెండు పార్టీలకు సంబంధించిన అభ్యర్దులు సగానికి పైగా స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయారు.

ఏపీలో ఈ ఇరు పార్టీలను ప్రజలు ఎంతలా ఛీకొట్టారో చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ. 25 లోక్‌సభ స్థానాల్లో కలిపి నోటాకు 1.5 శాతం ఓట్లు పోలవగా.. బీజేపీ ఓట్ల షేరింగ్ కేవలం 0.96 శాతం మాత్రమే. కాంగ్రెస్ 1.29 శాతం ఓట్లతో కాస్త పర్వాలేదనిపించింది.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ ఇదే సీన్ రిపీటైంది. 175 స్థానాల్లో కలిపి నోటా మీటకు 1.28 శాతం ఓట్లు పోలవగా.. బీజేపీ 0.84, కాంగ్రెస్ 1.17 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక జనసేన పార్టీ పరిస్థితి కూడా ఇంచుమించుగా ఇంతే . సుమారు 30 స్థానాల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి.  

Similar News