నీరు గారుతున్న 'మధ్యాహ్న భోజన పథకం'

Update: 2019-05-13 01:14 GMT

విద్యార్థుల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మధ్యాహ్న భోజన పథకం అమలు తీరునీరు గారుతున్నతోంది. వేసవి సెలవుల్లో కూడా పథకం అమలు జరపాలని ఆదేశాలున్నా ఆ పరిస్థితులు ప్రకాశం జిల్లాలో కనిపించడం లేదు. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఏజెన్సీలు నామమాత్రంగా పనిచేస్తున్నాయి. పేద విద్యార్థులు బడి బాట పట్టేలా వారి ఆకలి తీర్చేలా నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకం  అధికారుల నిర్లక్ష్యంతో పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ప్రకాశం జిల్లాలోని సుమారు 40 మండలాల్లో వేసవి సెలవుల్లో కూడా మధ్యాహ్న భోజనం అమలు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. అయినా ఆ విధంగా జరగడం లేదు.

వేసవి సెలవుల్లో కూడా ఉదయం 11 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టి మళ్లీ ఇండ్లకు పంపాలి. జిల్లాల్లోని 3200 పాఠశాలల్లో జూలై 11 వరకు ఈ విధంగానే కొనసాగాల్సిన పథకం నామమాత్రంగా అమలువుతోంది. ముఖ్యంగా పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో చాలా మంది పక్క ఊర్ల నుంచే వచ్చే వారే. ఎండల నేపథ్యంలో వారు మధ్యాహ్న భోజనానికి రావడం లేదు. దీనికి తోడు సంక్షేమ హాస్టల్స్ వేసవి సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు ఊళ్లకు వెళ్లిపోయారు. పైగా విద్యాశాఖ అధికారుల తనిఖీలు కూడా లేకపోవడంతో మధ్యాహ్న భోజనం పథకం అమలు గగనంగా మారింది.

గతంలో విద్యార్థులకు అవసరమైన భోజనం తయారుకు రేషన్ ద్వారా అందించే వారు. కానీ ఈ సారి స్కూళ్లకు వచ్చి భోజనం చేసి వెళ్లాలి. విద్యార్థులు తక్కువగా స్కూళ్లకు వస్తుండటంతో ఏజెన్సీలు మధ్యాహ్న భోజన పథకం పూర్తిగా అమలు చేయడం లేదు. వేసవి సెలవుల్లో కడుపు నింపుకోవడం కష్టంగా ఉన్న పేద విద్యార్థుల కోసమైన ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయాల్సి అవసరం ఉందని అంటున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

Full View

Similar News