సోషల్‌ మీడియా ప్రకటనలపై కొరడా

Update: 2019-03-22 09:27 GMT

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎన్నికల పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి తమ వేదికలపై ఎలాంటి రాజకీయ ప్రచారం, ప్రకటనలు చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పాయి. ఈ మేరకు రూపొందించిన​ స్వచ్ఛంద నియమాలను ఎలక్షన్‌ కమిషనకు నివేదించాయి. పోలింగ్‌కు 48 గంటల వ్యవధిని సైలెంట్ పిరియడ్ అంటారు ఆ సమయంలో ఎన్నికల ప్రచారం చేయకూడదు. అయితే ఈ నిబంధనలు సోషల్ మీడియాకు లేక పోవడంతో అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రచారం చేయవద్దనే నిబంధన సోషల్‌మీడియాకు వర్తించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నతరుణంలో ఆయా సంస్థలు స్పందించాయి. కోడ్‌ను ఉల్లంఘిస్తూ సైలెన్స్ పీరియడ్‌లో ఎవరైనా ప్రచారం చేసినట్టు తేలితే తొలగిస్తామని ఫేస్‌బుక్, వాట్సప్, గూ గుల్, ట్విట్టర్, టిక్‌టాక్, స్నాప్‌చాట్ వంటి సంస్థలు కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపాయి.

పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ ప్రచారం చేస్తున్నట్టు తమకొచ్చే ఫిర్యాదులు, ఈసీ ఇచ్చే ఆదేశాలను పరిశీలించి వెంటనే స్పందిస్తామని, 3 గంటల్లో సమాచారాన్ని తొలిగిస్తామని స్పష్టంచేశాయి. ఉల్లంఘన తీవ్రతను బట్టి తదుపరి చర్యలు ఉంటాయన్నాయి. ఈ నిబంధన నెల 20 నుంచి అమల్లోకి వచ్చింది. లోక్‌సభ ఎన్నికలు ముగిసేవరకు అమల్లో ఉంటుందని ఈసీ తెలిపింది. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుటామని ఈసీ పేర్కొంది. ఇప్పటికే సోషల్‌మీడియాలో ప్రకటనలను ఎన్నికల పరిధిలోకి తేవడం, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ వంటి నిబంధనలకు తో డు తాజా నిబంధన పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు మరింత సాయపడుతుందని ఈసీ భావిస్తోంది. 

Full View

Similar News