ప్రస్తుత పాక్ ప్రధాని ఎవరంటే టక్కున మన నుండి వచ్చే సమాధానం మాత్రం ఇమ్రాన్ ఖాన్ అనే .. కానీ అయన కాకుండా పాక్ ప్రధాని సచిన్ అంటే నమ్ముతారా ? అవును పాక్ ప్రధాని సచిన్ అయ్యాడు ఇలా .. ఇమ్రాన్ ఖాన్ అసిస్టెంట్ అయిన నయుముల్ హక్ చేసిన ఓ చిన్న తప్పు వల్ల సచిన్ పాక్ ప్రధాని అయ్యాడు .. నయుముల్ హక్ తన ట్విట్టర్ ఖాతాలో "1969లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్" ఇలా ఉన్నారని పోస్ట్ చేసారు . ఇంకేముంది .. నేటిజన్స్ ఫుల్ ట్రోల్స్ మొదలు పెట్టారు .. ఎందుకంటే అయన చేసిన పోస్ట్ లో ఉన్న ఫోటో ఇమ్రాన్ ఖాన్ ది కాదు .. సచిన్ ది.. దీనితో నయుముల్ హక్ నవ్వులపాలు అయ్యారు .. అయన పోస్ట్ చేసిన ఫోటో సచిన్ తొలి నాళ్లలో క్రికెట్ ఆడుతున్న సమయంలో దిగిన ఫోటో .. దీనితో అయన పై నేటిజన్స్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు ..
PM Imran Khan 1969 pic.twitter.com/uiivAOfszs
— Naeem ul Haque (@naeemul_haque) June 21, 2019