కోడెల జీవితమంతా అరాచకమే: గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి

Update: 2019-02-28 14:09 GMT

ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వైసీపీ నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గుంటూరులో శ్రీనివాస రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ అవినీతి, అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ కోడెల శివప్రసాద రావు అని దుయ్యబట్టారు. సత్తెనపల్లి, నరసరావుపేటల్లో స్పీకర్ కోడెల కుటుంబం వల్ల ఎంతో మంది తీవ్రనష్టపోయారని గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. ఇసుక లారీలను నడి రోడ్డు మీద ఆపి మీ సోంత అవసరాలకు వాడుకోలేదా అని ప్రశ్నించారు. ఇలా చెప్పుకుంటూపోతే స్పీకర్ జీవితమంతా అరాచకమేనన్నారు గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి. ఇవి అబద్దాలు అని కోడెల శివప్రసాదరావు కోటప్పకొండ మీద ప్రమాణం చేయగలరా అని కోడెలకు సవాల్ విసిరారు గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి. 

Similar News